Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మెంటలెక్కిస్తే ఛాన్సులిచ్చేస్తారా?

By:  Tupaki Desk   |   18 Dec 2020 7:00 AM IST
ఫోటో స్టోరి: మెంటలెక్కిస్తే ఛాన్సులిచ్చేస్తారా?
X
నేచుర‌ల్ స్టార్ నాని - కృష్ణ‌వంశీ కాంబో తెర‌కెక్కించిన‌ `పైసా`లో వేడెక్కించే పాత్ర‌లో న‌టించింది సిద్ధికా శ‌ర్మ‌. నాక్కూడా ప్ర‌కాష్ అంటే చాలా ఇష్టం. హీ ఈజ్ స్వీట్ హార్ట్!! అంటూ వ‌చ్చీ రాని తెలుగు మాట్లాడి తెగ క‌వ్వించిన ఈ బ్యూటీ పైసా ఫ్లాపవ్వ‌డంతో ఐపు లేకుండా పోయింది. టాలీవుడ్ క‌ల‌ల‌న్నీ మొద‌టి ప్ర‌య‌త్న‌మే ఆవిరైపోవ‌డంతో ఇక ముంబై ప‌లాయ‌నం చిత్త‌గించింది.

అయితే అప్పుడు మిస్స‌యిన సిద్ధిక సోష‌ల్ మీడియాల్లో మాత్రం ఫ్యాన్స్ కి ట‌చ్ లోనే ఉంది. నిరంత‌రం ఈ భామ బికినీ బీచ్ ఫోటోల‌తో మెంట‌లెక్కిస్తూనే ఉంటుంది. అందాల్ని ఆరాంగా తెర‌నిండుగా ప‌రిచేసేందుకు ఏమాత్రం అభ్యంత‌రం చెప్ప‌ని ఈ ఉత్త‌రాది భామ లేటెస్ట్ ఫోటో షూట్ యూత్ వాట్సాపుల్లో.. సోష‌ల్ మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది.

ఈ భామ హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ ఏమంత పాపుల‌ర్ కాదు. ఇంత‌కుముందు పంజాబీ మ్యూజిక్ ఆల్బ‌మ్ ల‌తో లైమ్ లైట్ లోకి వ‌చ్చి మోడ‌లింగ్ లో బిజీ అయ్యింది. అయితే సినీఛాన్సులేవీ రావ‌డం లేదు. ఇప్ప‌టికి ఇలా స‌రిపెట్టుకుంటోంది. క‌నీసం సిద్ధిక ప్ర‌య‌త్నం చూసి మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క‌నీసం ఐటెమ్ నంబ‌ర్ లో అయినా అవ‌కాశం ఇస్తారేమో చూడాలి.