Begin typing your search above and press return to search.

ఫోటో టాక్‌: బికినీ బీచ్ లో పైసా బ్యూటీ

By:  Tupaki Desk   |   3 Jan 2020 11:00 PM IST
ఫోటో టాక్‌: బికినీ బీచ్ లో పైసా బ్యూటీ
X
ముంబై హాటీ సిద్ధికా శ‌ర్మ గుర్తుందా? నాని - కృష్ణ‌వంశీ కాంబినేష‌న్ మూవీ పైసాలో వేడెక్కించే క్యారెక్ట‌ర్ లో ర‌క్తి క‌ట్టించింది. నాక్కూడా ప్ర‌కాష్ అంటే చాలా ఇష్టం. హీ ఈజ్ స్వీట్ హార్ట్ అంటూ వ‌చ్చీ రాని తెలుగు మాట్లాడి యూత్ ని క‌వ్వించింది. ఆ సినిమా ఫ్లాపవ్వ‌డంతో అంద‌రూ మ‌ర్చిపోయారు కానీ సిద్ధిక‌కు మ‌రో ఛాన్స్ ద‌క్కేదే.

అయితే అప్పుడు మిస్స‌యిన సిద్ధిక ఇదిగో ఇక్క‌డ బీచ్ లో తేలింది. బీచ్ ప‌రిస‌రాల్లో బికినీ ట్రీట్ తో అగ్గి రాజేసింది. అందాల్ని ఆరాంగా తెర‌నిండుగా ప‌రిచేసేందుకు ఏమాత్రం అభ్యంత‌రం చెప్ప‌ని ఈ ఉత్త‌రాది భామ బికినీ బీచ్ ని గ‌జ‌గ‌జ ఒణికిచింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యూత్ వాట్సాపుల్లో.. సోష‌ల్ మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది.

ఈ భామ హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ ఏమంత పాపుల‌ర్ కాదు. ఇంత‌కుముందు పంజాబీ మ్యూజిక్ ఆల్బ‌మ్ ల‌తో లైమ్ లైట్ లోకి వ‌చ్చి మోడ‌లింగ్ లో బిజీ అయ్యింది. అయితే సినీఛాన్సులేవీ పెద్దంత‌గా వ‌రించ‌లేదు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఫోటోషూట్ల‌తో ప్ర‌స్తుతం హీటెక్కించేస్తోంది. క‌నీసం త‌న కొత్త ఫోటోషూట్ చూశాక అయినా ఎవ‌రైనా ద‌ర్శ‌క‌నిర్మాత పిలిచి అవ‌కాశం ఇస్తారేమో చూడాలి. హీరోయిన్ గా కాక‌పోయినా క‌నీసం హాట్ ఐటెమ్ నంబ‌ర్ లో అయినా ఛాన్సిస్తారేమో.