Begin typing your search above and press return to search.

ట్విట్టర్ లో తిట్టేసుకున్న సిద్దూ-ఖాన్‌

By:  Tupaki Desk   |   27 Feb 2016 7:30 PM GMT
ట్విట్టర్ లో తిట్టేసుకున్న సిద్దూ-ఖాన్‌
X
స్టార్లు, సెలబ్రిటీలు తమ అభిమానులతో టచ్ లో ఉండేందుకు ట్విట్టర్ ఎంతగా ఉపయోగపడుతోందో.. పబ్లిక్ సాక్షిగా తిట్టుకునేందుకు కూడా వేదిక అవుతోంది. ఇప్పుడు ఇద్దరు బాలీవుడ్ ప్రముఖులు మాటలు పేల్చుకున్నారు. ఒకరినొకరు బాగానే తిట్టేసుకున్నారు. యువ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా, నటుడు కమల్ ఆర్ ఖాన్ లు ట్విట్టర్ లో తగవు పడ్డారు.

వోగ్‌ మేగజైన్ కోసం యంగ్ బ్యూటీ ఆలియా భట్ తో కలిసి బీచ్ డ్రస్ లో దిగిన ఫోటోను షేర్ చేశాడు సిద్ధార్ద్ మల్హోత్రా. ఆలియా అతి చిన్నని బికినీ బాటమ్‌లో ఈ కవర్‌ పై మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఫోటోలో ఆలియా చిన్న పిల్లలా ఉందంటూ కాసింత ఘాటు వ్యాఖ్యలే చేశాడు కమల్ ఆర్ ఖాన్. దీంతో సిద్దూకి ఒళ్లు మండి పోయి.. "మీ నోరు మూయించడానికి మేం చాలా కష్టపడుతున్నాం.. అయినా ట్వీట్ చేస్తూనే ఉన్నారం"టూ రిటార్ట్ ఇచ్చాడు. దీనికి ఆ యాక్టర్ కూడా ఏ మాత్రం తగ్గకుండా '130 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని యాక్టింగ్ మానేయమని అడుగుతున్నా మీరు మానేస్తున్నారా ఏంటి.. ఇంకా వేధిస్తున్నారుగా' అనేశాడు కమల్ ఆర్ ఖాన్.

'మీకు ఇంగ్లీష్ క్లాసులు చాలా అవసరం, ఎందుకంటే నేను రాసింది మీకు అర్ధం కాలేదు' అంటూ సిద్ధార్ధ్ కూడా ఆన్సరిచ్చాడు. ఇక్కడితో ఈ గొడవ ఆగిపోయినా.. అసలు ఈ కమల్ ఆర్ ఖాన్ కి ఇలా ఆన్ లైన్ గొడవలు కామన్ అయిపోతున్నాయి. గతంలో రామ్ గోపాల్ వర్మ, సోనాక్షి సిన్హా, కరణ్ జోహార్, కపిల్ శర్మలతో ఇలాగే గొడవ పడ్డ హిస్టరీ ఉంది ఈయనకు.