Begin typing your search above and press return to search.

లస్ట్ భామను చూసి మనసు పారేసుకున్నాడా?

By:  Tupaki Desk   |   5 Feb 2019 8:35 PM IST
లస్ట్ భామను చూసి మనసు పారేసుకున్నాడా?
X
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హిందీ ప్రేక్షకుల్లోనే కాదు తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ గుర్తింపు తెచ్చుకున్న భామ. ఇక 'లస్ట్ సీరీస్' లాంటి ఘాటు వెబ్ సీరీస్ లో నటించి న్యూ జెనరేషన్ నెటిజనులకు కిక్కిచ్చిన బ్యూటీ కియారా. ఈ బ్యూటీని చూసి ఒక బాలీవుడ్ హీరో మనసుపారేసుకున్నాడని ముంబై మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

ఆ హీరో ఎవరు కాదు హ్యాండ్సమ్ హంక్ సిద్ధార్థ్ మల్హోత్రా. ఎందరో స్టార్ కిడ్స్ కు పర్మనెంట్ గాడ్ ఫాదర్ అయిన కరణ్ జోహార్ ఈమధ్య ఒకసారి బాలీవుడ్ సెలబ్రిటీలకు పెద్ద పార్టీ ఇచ్చాడట. ఆ పార్టీలో సిద్ధార్థ్ - కియరాలకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందట. ఆ పార్టీ తర్వాతే ఇద్దరి ఎఫైర్ పై రూమర్లు మొదలయ్యాయి. కరణ్ జోహార్ ఈ విషయంపై సిద్ధార్థ్ ను ఒక షోలో ప్రశ్నిస్తే.. కియారా తనకు ఫ్యూచర్ కో-స్టార్ అని తనతో వర్క్ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. మరి లస్ట్ స్టొరీ ఏదైనా ఉందా అని అడిగితే.. "ఇప్పటికి లేదు. నేను ఇంకా సింగిల్" అని సమాధానం ఇచ్చాడు. అయినా మన పిచ్చిగానీ సింగిల్ గా ఉంటేనే కదా మింగిల్ అయ్యేదానికి ఫుల్లుగా స్కోప్ ఉండేది!

ఈ గాసిప్పులపై ఇంకా కియరాను ఎవరూ ప్రశ్నలు అడగలేదు. మరి ఆ వినయ విధేయ భామ ఈ ఎఫైర్ వార్తలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. సిద్ధార్థ్ మల్హోత్రా శ్రీలంకన్ బ్యూటీ జాక్వేలిన్ ఫెర్నాండెజ్ తో కూడా ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకున్నాడని కూడా రూమర్లు ఉన్నాయి. బాబు బాగా బిజీగా ఉన్నాడేమో!