Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ పిల్లల పేర్లు తెలుసా?

By:  Tupaki Desk   |   24 Aug 2017 9:22 AM GMT
ఆ హీరోయిన్ పిల్లల పేర్లు తెలుసా?
X
ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రేక్షకులందరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం "ఏ జెంటిల్ మెన్". రాజ్-డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీ యాక్షన్ డ్రామా మరియు రొమాన్స్ తరహాలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. అయితే రీసెంట్ గా ఏ జెంటిల్ మెన్ హీరో హీరోయిన్ సిద్ధార్థ్ మల్హోత్రా - జక్వాలిన్ ఫెర్నాండేజ్ ప్రచారంలో పాల్గొని.. ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన హీరో సిద్దార్థ్ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశాడు. అది కూడా హీరోయిన్ జక్వాలిన్ పైనే. అతను ఏమన్నడంటే.. జక్వాలిన్ కి పిల్లలు పుడితే వారికి ఫేస్ బుక్- ట్విట్టర్ - ఇన్ స్టాగ్రామ్ అని సోషల్ మీడియా పేర్లు పెట్టాల్సిందేనని చెప్పి అందరిని ఒక్కసారిగా నవ్వించాడు. ఎందుకంటే ఆమె కు టైమ్ దొరికితే సోషల్ మిడియాతోనే కాలాన్ని గడిపేస్తుందని సిద్ధార్థ్ చెప్పాడు. ఒకవేళ సోషల్ మీడియాను కట్టి పెట్టేస్తే.. ఆమె చనిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ గా అలరిస్తున్నాయి. ఇక ఏ జెంటిల్ మెన్ సినిమా శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయిపోయింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జక్వాలిన్ ఘాటు ముద్దులు ఆకట్టుకుంటాయని ప్రచారం జరుగుతోంది. అంతే కాదు.. ఆమె బికినీ ట్రీట్.. అలాగే పోల్ డ్యాన్సింగ్ టీజర్లు కూడా ఆల్రెడీ పిచ్చెక్కించడంతో.. జాకీ దెబ్బకి సినిమాకు భారీ ఓపెనింగులు వచ్చే ఛాన్సుందిలే.