Begin typing your search above and press return to search.

స్టేజ్ మీద మంటలు పుట్టించేశారు

By:  Tupaki Desk   |   18 Aug 2016 4:37 AM GMT
స్టేజ్ మీద మంటలు పుట్టించేశారు
X
డ్రీమ్ టూర్ 2016 పేరుతో.. ఇప్పుడు మన బాలీవుడ్ తారలు చాలామంది అమెరికాలో చక్కర్లు కొట్టేస్తున్నారు. కాన్సర్ట్ లలో లైవ్ పెర్ఫామెన్సులతో ఇరగదీసేస్తున్నారు. ఆలియా భట్ - సిద్ధార్ధ మల్హోత్రా.. ఆదిత్యా రాయ్ కపూర్.. కత్రినా కైఫ్.. కరణ్ జోహార్.. పరిణీతి చోప్రాలు ఈ డ్రీమ్ టూర్ లో భాగం. అందరూ ఎవరికి వారే అన్నట్లు రెచ్చిపోతున్నారు కానీ.. ఆలియా భట్-సిద్ధార్ధ మల్హోత్రాల గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకునే పరిస్థితి.

మామూలుగానే ఈ యంగ్ జనరేషన్ రెచ్చిపోతూ ఉంటుంది. ఇక అమెరికాలో లైవ్ షోస్ అంటే.. ఆ జోరు మామూలుగా ఉండడం లేదు. ఆలియా- సిద్ధార్ధల ఓ పెర్ఫామెన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. సాంగ్ మొత్తంలో సగానికి పైగా టైమ్.. ఆలియా నేల మీద కాలు పెట్టలేదంటే.. వీరిద్దరి కెమిస్ట్రీ అర్ధం చేసుకోవచ్చు. క్రీమ్ ఔట్ ఫిట్స్ లో సిద్ధార్ధ.. రెడ్ కలర్ టాప్ లో ఆలియా భలే మెరిసిపోయారు లెండి. ఎత్తుకోవడం.. ముద్దులాడడం.. వాటేసుకోవడం.. ఇదీ ఆ పెర్ఫామెన్స్.

ఇంత చేసి కూడా ఎక్కడా వల్గర్ గా అనిపించకుండా పెర్ఫామెన్స్ పూర్తి చేశారంటే.. వీళ్లు ఏ రేంజ్ లో కెమిస్ట్రీ చూపించారో.. పెర్ఫామెన్స్ పండించారో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలియా- సిద్ధార్ధ మల్హోత్రాల పెర్ఫామెన్స్ కి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. #SidAlia అనే హ్యాష్ టాగ్ కూడా ట్రెండింగ్ అయిపోయింది.