Begin typing your search above and press return to search.

ఈ 'గుంటూరు టాకీస్‌' కుర్రాడి పట్టుదల అభినందనీయం

By:  Tupaki Desk   |   31 March 2021 12:30 AM GMT
ఈ గుంటూరు టాకీస్‌ కుర్రాడి పట్టుదల అభినందనీయం
X
ఇతడు నటించిన మొదటి సినిమా విడుదలై పుష్కర కాలం అవుతోంది. ఇక హీరోగా ఇతను నటించడం మొదలు పెట్టి దశాబ్దం అవుతోంది. అయినా కూడా ఇప్పటికి ప్రేక్షకుల్లో అంతంత మాత్రంగానే గుర్తింపు దక్కించుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. విలక్షణ పాత్రలు.. సినిమాలు చేస్తాడనే పేరును ఇండస్ట్రీలో అయితే దక్కించుకున్నాడు కాని ప్రేక్షకుల్లో మాత్రం ఇంకా ఆ స్థాయిలో గుర్తింపును దక్కించుకోలేక పోతున్నాడు. అప్పుడెప్పుడో నటించిన గుంటూరు టాకీస్ సినిమాతోనే ఈయన్ను జనాలు కొందరు గుర్తు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈయన నటించిన కృష్ణ అండ్ ఇజ్ లీల మరియు మా వింత గాథ వినుమా సినిమాలు ఓటీటీలో వచ్చి ఆకట్టుకున్నాయి. అయినా కూడా హీరోగా మాత్రం రావాల్సినంత క్రేజ్‌ రాలేదు.

ప్రస్తుతం ఈయన నరుడి బ్రతుకు నటన అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మెల్లగా సాగుతోంది. సినిమాలో సిద్దు పాత్ర చాలా విభిన్నంగా ఉండటంతో పాటు ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు. అందుకే సినిమా లుక్ కోసం చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా అయినా థియేటర్లకు వచ్చేనా.. దీంతో అయినా సిద్దుకు హీరోగా బ్రేక్ థ్రూ లభించేనా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. నటుడిగా పాజిటివ్‌ మార్కులు దక్కించుకుంటున్న సిద్దు కమర్షియల్‌ సినిమాలతో రావాలని అప్పుడే ప్రేక్షకులు ఆయన్ను ఆధరిస్తారనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.