Begin typing your search above and press return to search.
'పాన్ ఇండియా మోసం'.. సిద్ధార్థ్ ట్వీట్ 'పుష్ప' ను ఉద్దేశించేనా..?
By: Tupaki Desk | 22 Dec 2021 4:01 PM IST'బొమ్మరిల్లు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన హీరో సిద్ధార్థ్.. ఇటీవల 'మహాసముద్రం' చిత్రంతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చారు. ఇక సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో కూడా సిద్దార్థ్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని ఆలోచనలను నిర్భయంగా నిక్కచ్చిగా చెబుతూ ఉంటారు. సామాజిక అంశాల మీద.. ప్రభుత్వ విధానాలు వైఫల్యాల మీద.. సినీ ఇండస్ట్రీ గురించి తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సిద్దార్థ్ ఎన్నో బెదిరింపులు - ట్రోల్స్ ఎదుర్కొంటుంటారు.
తాజాగా పాన్ ఇండియా సినిమాల బాక్సాఫీస్ వసూళ్ల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ సిద్దార్థ్ ట్వీట్ చేశారు. నిర్మాతలు సినిమా కలెక్షన్స్ విషయంలో అబద్ధాలు చెప్తున్నారని.. దీనికి వారు ఎంత కమిషన్ చెల్లిస్తున్నారని ప్రశ్నించాడు.
“ఈ రోజుల్లో సినిమాల కలెక్షన్ రిపోర్టులను ఫడ్జింగ్ చేయడానికి కమీషన్ లేదా రేటు ఎంత? నిర్మాతలు చాలా కాలంగా బాక్సాఫీస్ లెక్కల గురించి అబద్ధాలు చెబుతున్నారు.. ఇప్పుడు "వాణిజ్యం" మరియు "మీడియా" వారి "అధికారిక" గణాంకాలను చెప్పడం ప్రారంభించాయి.. అన్ని భాషలు, అన్ని పరిశ్రమలు ఒకేలా ఉన్నాయి. పాన్ ఇండియా మోసం” అని సిద్దార్థ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
సిద్దార్థ్ తన ట్వీట్ లో ఏ సినిమాని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కాకపోతే ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప' కావడంతో.. ఈ సినిమాని ఉద్దేశించే బొమ్మరిల్లు హీరో ట్వీట్ చేసి ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ''పుష్ప: ది రైజ్'' సినిమా మూడు రోజుల్లో 173 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నాలుగో రోజుతో 203 కోట్లు దాటిందని అంటున్నారు.
కాకపోతే మిశ్రమ స్పందన తెచ్చుకున్న 'పుష్ప' సినిమాని ఆ స్థాయి కలెక్షన్స్ ఎలా వచ్చాయని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు హీరో సిద్దార్థ్ కూడా పాన్ ఇండియా మోసం అంటూ ఫేక్ కలెక్షన్స్ గురించి ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
అయితే సిద్దార్థ్ చేతిలో ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో.. అటెన్షన్ కోసమే ఇలాంటి పోస్టులు పెడుతున్నారని కొందరు ట్విట్టర్ లో విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం 'పుష్ప' సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ తో పేరు తెచ్చుకుందనే సిద్దార్థ్ ట్వీట్ చేసారని కామెంట్స్ పెడుతున్నారు.
ఏదేమైనా ప్రస్తుతం ఇండస్ట్రీలో బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో స్టార్ హీరోల మధ్య పోటీ నడుస్తున్న తరుణంలో.. సిద్దార్థ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.