Begin typing your search above and press return to search.

'మనం' కథ అక్కినేనోళ్ళది కాదట

By:  Tupaki Desk   |   21 Oct 2017 4:17 PM IST
మనం కథ అక్కినేనోళ్ళది కాదట
X
సినిమా అంటేనే ఒక ఊహ. దర్శకుడు తన కథను ఏ స్థాయిలో ఉహించి రాసుకుంటాడో అతని ఊహ ఎంత అందమైనదో అనే విషయం మనకు తెరపై చూస్తేనే అర్ధమవుతుంది. ఏడాదికి ప్రతి సినిమా ఇండస్ట్రిలో వందల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి సినిమాల్లో మనం సినిమా ఒకటి.

2014 లో వచ్చిన ఈ సినిమాకు ఎంత ప్రత్యేకత ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని వారసులు మొత్తం ఆ సినిమాలో భాగమయ్యారు. ఎవర్ గ్రీన్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమా కూడా అదే. నిజంగా అందరికి ఆ అదృష్టం దక్కదేమో. సినీ పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోల కుటుంబాలు ఉన్నాయి. కానీ చాలావరకు ఎవరు సరైన కథ దొరకకపోవడంతో అందరు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి నటించలేకపోతున్నారు. కానీ ఏ క్షణాన విక్రమ్ కుమార్ మనం అనే కథను రాసుకున్నాడో గాని అక్కినేని కుటుంబానికి ఆ కథ సెట్ అయ్యింది.

అసలైతే ఆ కథ ముందుగా వేరొకరితో చెయ్యాలని దర్శకుడు అనుకున్నాడట. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆ ఛాన్స్ ను కోల్పోయానని హీరో సిద్దార్థ్ చెప్పాడు. అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో కళాతపస్వి కె.విశ్వనాథ్.. అలాగే నాగార్జున క్యారెక్టర్ కి వెంకటేష్ గారిని అనుకోని చివరగా నాగ చైతన్య పాత్రకు నన్ను అనుకున్నారని సిద్దార్థ్ తెలుపుతూ.. అనుకోని కారణాల వల్ల అది అక్కినేని వారి ఫ్యామిలీ కథగా సాగిందని చెప్పాడు.