Begin typing your search above and press return to search.

తెలుగుని మర్చిపోయావా సిద్ధూ

By:  Tupaki Desk   |   16 Sept 2015 9:00 PM IST
తెలుగుని మర్చిపోయావా సిద్ధూ
X
బొమ్మరిల్లు సమయంలో యూత్ కి రోల్ మోడల్ గా నిలిచిన సిద్ధూ ఆ టైం లోనే థర్టీస్ కి దగ్గర పడుతున్నాడంటే ఆశ్చర్యపోక తప్పలేదు. తొలినాళ్ళలోనే బాయ్స్ - నువ్వొస్తానంటే..,, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ లు సొంతం చేసుకున్న సిద్ధూ తనకంటూ ఒక ఇమేజ్ ని సృష్టించుకున్నాడు. తమిళ మాతృకకి చెందిన నటుడైనా తెలుగు మీద మమకారంతో ఇక్కడే అధిక సినిమాలు చేస్తూ ప్రశంసలు పొందాడు.

అయితే సడన్ గా సీన్ రివర్స్ అయ్యింది. తెలుగులో సిద్ధూ కి గతంలో వచ్చిన సినిమాలేమీ విజయాలను అందించకపోవడంతో అతనికి అవకాశాలు కరువయ్యాయి. ఏ ఇమేజ్ ని బిల్డ్ చేసుకున్నాడో దాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యాడు. అందుకే తమిళ బాట పట్టిన సిద్ధూ అక్కడ సినిమాలలో మాత్రమే నటిస్తూ విజయాల్నిసాధించడం గమనార్హం. జబర్దస్త్ పరాజయం పాలవడంతో తెలుగు సినిమాలకు సిద్ధూ గుడ్ బై చెప్పినట్టు వార్తలు వినిపించాయి.

ఆపై తాను నటించిన సంథింగ్ సంథింగ్ అనువాద విజయంగా మిగిలింది. అయితే తమిళనాట ఘన విజయం సాధించిన జిగార్తందా ఇంకా మన ప్రేక్షకుల దగ్గరకు చేరలేదు. సిద్ధార్ధ్ ని మన తెలుగు వారు మర్చిపోకముందే, తెలుగులో అతనికి మార్కెట్ పూర్తిగా పోకముందే ఒక మంచి కాంబినేషన్ తో చిత్రం పడితే బాగుంటుందని కొందరి భావన. మరి మీరేమంటారు??