Begin typing your search above and press return to search.
అఫిషియల్ : బొమ్మరిల్లు సిద్దు టాలీవుడ్ రీ ఎంట్రీ
By: Tupaki Desk | 18 Sept 2020 10:00 AM ISTనిన్న సాయంత్రం ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అనీల్ సుంకర రేపు ఉదయం మహా అనౌన్స్ మెంట్ ఉండబోతుంది అంటూ ప్రకటించినప్పటి నుండి అందరిలో ఆసక్తి నెలకొంది. మహాసముద్రం సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తారని అందరికి తెలుసు. అయితే మహాసముద్రంకు సంబంధించిన ఏ విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నారు అనే విషయమై సస్పెన్స్ నెలకొంది. అన్నట్లుగానే నేడు ఉదయం మహా అనౌన్స్ మెంట్ వచ్చింది. ఆర్ ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందబోతున్న మహా సముద్రంలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నాడు. ఆ సినిమాలో బొమ్మరిల్లు సిద్దార్థ కీలక పాత్రలో నటించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమే నిజం అయ్యింది. అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
తెలుగులో చాలా సినిమాల్లో హీరోగా నటించి సూపర్ హిట్స్ దక్కించుకున్న సిద్దార్థ ఆ తర్వాత సినిమాలు నిరాశ పర్చడంతో టాలీవుడ్ కు దూరం అయ్యాడు. ఆయన సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. అవి కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో డైరెక్ట్ సినిమాను సిద్దార్థ చేయబోతున్నాడు. మహాసముద్రం సినిమాలోని పాత్ర నచ్చడంతో వెంటనే నటించేందుకు ఒప్పుకున్నాడట. ఈ ఏడాది ఆరంభంలో సరి లేరు నీకెవ్వరు సినిమాతో సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఇప్పుడు నాలుగు అయిదు పెద్ద ప్రాజెక్ట్ లను చేస్తోంది. అందులో ఇది ఒకటి.
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో మాస్ ఆడియన్స్ ను మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాతో మరో సూపర్ సక్సెస్ ను అందుకోవాలనే ఉద్దేశ్యంతో దాదాపుగా ఏడాది పాటు స్క్రిప్ట్ పై కూర్చున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నారు. వారం వారం ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏదో ఒకటి ఇస్తామంటూ యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. సిద్దుపై క్లారిటీ ఇచ్చిన యూనిట్ సభ్యులు త్వరలో హీరోయిన్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

He is an ocean of talent and returns back to Telugu Cinema..Welcoming @Actor_Siddharth on board for #Mahasamudram