Begin typing your search above and press return to search.
పాపం.. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాడు...!
By: Tupaki Desk | 28 April 2020 6:00 PM IST'నువ్వొస్తానంటే నేనోద్దంటున్నానా' 'బొమ్మరిల్లు' 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' 'ఓయ్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన హీరో సిద్ధార్థ్. దక్షిణాదిలో మంచి పేరు సంపాదించిన సిద్ధార్థ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాలలో నటించాడు. గతేడాది 'అరువం' అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. తెలుగులో ఇది 'వదలడు' పేరుతో విడుదలైంది. ఈ చిత్రానికి కూడా అంత ఆదరణ లభించలేదు. ఇటీవల వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సిద్ధార్ద్ తన మార్కెట్‌ని పెంచుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు. చివరగా 'బాద్ షా' సినిమాలో గెస్ట్ రోల్ చేసిన సిద్ధూ మళ్ళీ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించలేదు. కానీ 'గృహం' 'వదలడు' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే చాలా రోజుల తర్వాత మన 'బొమ్మరిల్లు' సిద్ధార్థ ఇప్పుడు ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో షికారు చేస్తోంది.
'Rx 100' లాంటి సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ‘మహా సముద్రం’ అనే మల్టీస్టారర్ పట్టాలెక్కించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోలుగా చాలా మంది పేర్లే తెరపైకి వచ్చాయి. అయితే చివరికి ఒక హీరోగా యంగ్ హీరో శర్వానంద్ ని ఫైనలైజ్ చేశారట. అయితే ఈ చిత్రంలో మరో హీరోగా రవితేజ నటించబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ మాస్ మహారాజా వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో హీరో సిద్ధార్థతో ముందుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నటించడానికి సిద్ధార్థ్ తో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారట. సిద్దార్థ్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఇంటరెస్ట్ చుపిస్తున్నాడట. తెలుగులో తన రీఎంట్రికి ఇదే మంచి సినిమా అని భావిస్తున్నాడట. ఈ విషయం తెలిసిన సినీ అభిమానులు ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కి పోయిన సిద్ధార్థ ఇప్పుడు రీఎంట్రీ కోసం పాట్లుపడుతున్నదంటూ, పాపం.. సిద్దార్థ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఈ మల్టీస్టారర్ లో ఒక హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకుంటుండగా మరో హీరోయిన్ ని కోసం వేట మొదలుపెట్టారట. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర తన ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించనున్నారు. అంతేకాకుండా అజయ్ భూపతి ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడట. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఈ సినిమాకి సంభందించి పూర్తి వివరాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉండగా సిద్ధార్థ్ ప్రస్తుతం కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో 'టక్కర్' అనే సినిమా చేస్తున్నాడు.