Begin typing your search above and press return to search.

సిద్ధాపురానికి త్వరలో శ్రీమంతుడు

By:  Tupaki Desk   |   24 Oct 2015 2:17 PM IST
సిద్ధాపురానికి త్వరలో శ్రీమంతుడు
X
సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తాను నిజమైన శ్రీమంతుడినేనని నిరూపించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకు కృష్ణ అభిమానులు బ్మహ్మరథం పట్టారు. సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్ ను ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాదర్ గోరి అధ్వర్యంలో ఆ గ్రామస్థులు కలిసి తమ ధన్యవాదాలను తెలియజేశారు. గ్రామ సర్పంచ్ ఎర్రోజు నర్సమ్మ - ఎంపీటీసీ బాలయ్య సహా శివాజీ యూత్ సహా యువజన సంఘ కార్యకర్తలు మహేశ్ ను కలిశారు. బ్రహ్మోత్సవం షూటింగ్ లో ఉన్న మహేష్ కు వారంతా బ్మహ్మరథం పట్టగా ఆయన అందరినీ కలిసి వారితో చాలాసేపు మాట్లాడారు. యోగక్షేమాలు కనుక్కున్నారు. తమ గ్రామానికి రావాల్సిందిగా వారు మహేష్ బాబును కోరగా ఆయన వస్తానని మాటిచ్చారు.

కాగా మహబూబ్ నగర్ జిల్లా సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు పది రోజుల కిందటే సిద్ధాపురం గ్రామానికి సంబంధించిన సమాచారం సేకరించారు. తన ప్రతినిధులను పంపి అక్కడ సమస్యలేమున్నాయి... ఏమేం చేయొచ్చో సమాచారం తెప్పించుకున్నారు. త్వరలో ఆయన సిద్ధాపురంలో పర్యటిస్తారని.. అక్కడ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.