Begin typing your search above and press return to search.

అస‌లు రాజీ అన్న‌దే లేని శ్యాం సింఘ‌రాయ్!

By:  Tupaki Desk   |   11 April 2021 9:34 AM GMT
అస‌లు రాజీ అన్న‌దే లేని శ్యాం సింఘ‌రాయ్!
X
ఇంద్ర‌గంటితో `వీ` చిత్రం ఫ్లాపైనా దాని ప్ర‌భావం నాని కెరీర్ పై ఏమాత్రం లేదు. అతడు జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేని క్రేజీ హీరో అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న నాని త‌న‌ మార్కెట్ రేంజును విస్త‌రించాల‌న్న క‌సితో ప‌ని చేస్తున్నారు.

నాని ఇటీవ‌ల‌ కొన్ని పెద్ద సినిమాలు చేస్తున్నారు. వాటిలో శ్యామ్ సింఘరాయ్ ఎంతో క్రేజీ ప్రాజెక్ట్ అని తెలిసింది. నాని సన్నిహితుడు వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో రాజీ అన్న‌దే లేకుండా నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ అన్ లాక్ ప్ర‌క్రియ‌ అనంత‌రం షూటింగ్ జోరందుకుంది. ఈ చిత్రం పెద్ద హిట్ కావాల‌నే క‌సితో నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస షిఫ్టుల్లో ప‌ని చేస్తున్నారు.

ఫిలిం వ‌ర్గాల గుస‌గుస ప్ర‌కారం.. రోజులు గడిచేకొద్దీ ఈ సినిమా బడ్జెట్ పెరుగుతోందిట‌. కోవిడ్ భయం కారణంగా ఈ చిత్రం చాలావరకు సెట్స్ ‌లోనే చిత్రీకరిస్తుండ‌డంతో బడ్జెట్ అమాంతం పెరిగింద‌ని స‌మాచారం. కార‌ణం ఏదైనా కానీ నాని మార్కెట్ ప‌రిధిని దాటి బ‌డ్జెట్లు పెట్టేస్తున్నార‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

మ‌రోవైపు సింగ‌రాయ్ పై నాని అభిమానుల్లో బోలెడ‌న్ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రొటీన్ కి భిన్న‌మైన క‌థ‌తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నార‌ని పోస్ట‌ర్లు ఇప్ప‌టికే వెల్ల‌డించాయి. ఇక నాని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ కొడితే 30-35 కోట్లు సునాయాసంగా వ‌సూలు చేస్తున్నాయి. దానికి మించి ఈ సినిమాకి బ‌డ్జెట్ పెడుతున్నారా? అన్న‌దే ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల చ‌ర్చ‌. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్య‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.