Begin typing your search above and press return to search.

శ్యామ్ సింఘ‌రాయ్ టీజర్ వచ్చేస్తోంది.. రెడీ టూ క్యాచ్!

By:  Tupaki Desk   |   8 March 2021 9:11 AM GMT
శ్యామ్ సింఘ‌రాయ్ టీజర్ వచ్చేస్తోంది.. రెడీ టూ క్యాచ్!
X
నేచుర‌ల్ స్టార్ నాని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఓ వైపు శ్యామ్ సింఘ‌రాయ్‌.. మ‌రోవైపు ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాల‌ను పార‌లాల్ గా కంటిన్యూ చేస్తున్నాడు. ఇందులో ట‌క్ జ‌గ‌దీష్ ఏప్రిల్ లో రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. శ్యామ్ సింఘ‌రాయ్ టీజ‌ర్ విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన శ్యామ్ ఫ‌స్ట్ లుక్ కు మంచి స్పంద‌న ల‌భించింది. ఇక‌, ఆడియ‌న్స్ కు టీజ‌ర్ టేస్ట్ కూడా చూపించాల‌ని నిర్ణ‌యించుకుంది యూనిట్‌. ఈ నేప‌థ్యంలో టీజ‌ర్ క‌ట్టింగ్ పై దృష్టి పెట్టాడు ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్య‌న్.

అందుతున్న స‌మాచారం ప్ర‌కారం వ‌చ్చే నెల‌లో ఈ టీజ‌ర్ ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నార‌ని తెలుస్తోంది. ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని టీజ‌ర్ వ‌ద‌ల‌బోతున్నార‌ట మేక‌ర్స్‌. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే అధికారిక ‌ప్ర‌క‌ట‌న రానుంది.

ఈ సినిమాలో నాని స‌ర‌స‌న నేచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. అంతేకాదు.. ఉప్పెన సంచ‌ల‌నం కృతిశెట్టి నటిస్తోంది. వీరిద్దరే కాకుండా.. మడోన్నా సెబాస్టియన్ కూడా కీ రోల్ ప్లేచేస్తున్నారు. నిహారికా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.