Begin typing your search above and press return to search.

ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్న నాని పీరియడిక్ మూవీ!

By:  Tupaki Desk   |   24 Jun 2021 2:30 PM GMT
ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్న నాని పీరియడిక్ మూవీ!
X
నేచురల్ స్టార్ నాని కథానాయకుడుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఆనాటి కాలం గుర్తుచేస్తూ పీరియడిక్ సినిమాగా ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ నుండి రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఎందుకంటే నాని కెరీర్ లో మొదటిసారి పీరియడిక్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. యాక్టర్స్ లుక్ పరంగా నాటి నేటివిటిని పకడ్బంధీ ప్లాన్ తో సెట్ చేసినట్లుగా అర్ధమవుతుంది. ఆనాటి వేశాధారణ.. హెయిర్ స్టైల్.. మీసకట్టు.. ఇలా అన్నివిధాలా నానిని బెంగాలీ యువకుడిగా మార్చేశారు మేకర్స్.

శ్యామ్ సింగరాయ్ సినిమా 1960-70 కాలం నేపథ్యంలో తెరకెక్కుతోందని ఆల్రెడీ సినీవర్గాలు తెలిపినదే. కానీ ఏ ఒక్కరి లైఫ్ నుండి స్ఫూర్తి పొంది తీయడం లేదని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో నాని ద్విపాత్రభినయం చేయనున్నాడు. పునర్జన్మల నేపథ్యం కాబట్టి ఈ సినిమా గురించి ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు దర్శకనిర్మాతలు. మొన్నటివరకు సినిమా కలకత్తాలో షూటింగ్ జరుపుకుంది. అయితే లాక్డౌన్ కారణంగా మొన్నటివరకు షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా లాక్ డౌన్ ముగియడంతో మేకర్స్ సినిమా షూటింగ్ పునఃప్రారంభించినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాకి సంబంధించి ఫైనల్ షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. అదికూడా ప్రెసెంట్ ప్రొసీసింగ్ లో ఉంది కాబట్టి త్వరలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి మెయిన్ హీరోయిన్. ఆ కాలంలో నాని పై మనసు పడిన ప్రియురాలిగా సాయిపల్లవి కనిపించనుంది. అలాగే మరో ఇద్దరు కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ కృతిశెట్టి తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసుకుందట. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా.. వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.