Begin typing your search above and press return to search.
నేచురల్ స్టార్ 'శ్యామ్ సింగ రాయ్' షూటింగ్ ప్రారంభం..!
By: Tupaki Desk | 10 Dec 2020 2:07 PM ISTసహజమైన నటనతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని మరో వైవిధ్యమైన సినిమాతో వస్తున్నాడు. ''శ్యామ్ సింగ రాయ్'' అనే డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1గా వస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో భారీ స్కేల్ లో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో నాని కి జోడీగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి - గార్జియస్ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈరోజు గురువారం హైదరాబాద్ లో 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.
'శ్యామ్ సింగ రాయ్' ముహూర్తపు సన్నివేశానికి నాని తండ్రి గంటా రాంబాబు క్లాప్ కొట్టారు. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాని - సాయి పల్లవి - కృతి శెట్టి లతో ముహూర్తపు సన్నివేశానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు శివ నిర్వాణ - వెంకీ కుడుముల స్క్రిప్ట్ ని మేకర్స్ చేతికి అందించారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి సత్యదేవ్ జంగా ఒరిజినల్ స్టోరీ అందిస్తున్నారు. మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తుండగా.. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. ఈ చిత్రంలో నాని ఇంతకముందు చేయని డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నాడు. 'శ్యామ్ సింగ రాయ్' మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభమవుతుందని మేకర్స్ ప్రకటించారు.