Begin typing your search above and press return to search.

#DRUGS లో బాలీవుడ్ ని నిందించొద్ద‌న్న‌ శ్వేతాబ‌సు - నవాజ్

By:  Tupaki Desk   |   9 Oct 2020 12:00 PM IST
#DRUGS లో బాలీవుడ్ ని నిందించొద్ద‌న్న‌ శ్వేతాబ‌సు - నవాజ్
X
సుశాంత్ సింగ్ మ‌ర‌ణానంత‌రం బాలీవుడ్ లో డ్ర‌గ్స్ సిండికేట్ పై ఎన్.సి.బి విచార‌ణ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ప‌లువురు స్టార్ల‌ను నార్కోటిక్స్ అధికారులు విచారించారు. ఇందులో బాలీవుడ్ పేరు చెడ‌గొట్టార‌న్న దానిపై ముంబై బ్యూటీ శ్వేతాబ‌సు ప్ర‌సాద్.. న‌వాజుద్దీన్ సిద్ధికి.. మీడియా ముఖంగా ఖండించారు.

నవాజుద్దీన్ సిద్దిఖీ.. శ్వేతా బసు ప్రసాద్ .. ఇందిరా తివారీ కీల‌క పాత్రలు పోషించిన‌ నెట్ ‌ఫ్లిక్స్ చిత్రం `సీరియస్ మెన్` కొద్దిసేపటి క్రితం విడుదలైంది. దేశవ్యాప్తంగా థియేటర్లు మూత‌ప‌డ‌డంతో ఓటీటీ లో రిలీజ్ చేసామ‌ని నిర్మాత‌లు తెలిపారు. సుధీర్ మిశ్రా ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించారు.

నవాజుద్దీన్ సిద్దిఖీ.. శ్వేతా బసు ప్రసాద్ ఓ ఇంట‌ర్వ్యూలో OTT ప్లాట్‌ఫాం స‌హా ఇతర సంబంధిత విష‌యాల‌పై ము‌చ్చ‌టించారు. చిన్న సినిమాలు లేదా నాన్-స్టార్ మూవీస్ పైనా ముచ్చ‌టించారు. ఇక ఇటీవ‌ల మాదకద్రవ్యాలు స‌హా ఇతర ఆరోపణలపై బాలీవుడ్ ఎలా నింద‌కు గురైందో కూడా ఆ ఇద్ద‌రూ మాట్లాడారు. ప‌రిశ్ర‌మ‌పై దుర్భాషలాడటం చాలా తప్పు అని బాలీవుడ్ పై మాదకద్రవ్యాల ఆరోపణలను ఆ ఇరువురూ తోసిపుచ్చారు. ఇలా నిందించ‌డం స‌రికాద‌ని అన్నారు.