Begin typing your search above and press return to search.

అమ్మ చాలాసార్లు చెంప దెబ్బ కొట్టేద‌న్న స్టార్ డాట‌ర్

By:  Tupaki Desk   |   11 Oct 2022 4:28 AM GMT
అమ్మ చాలాసార్లు చెంప దెబ్బ కొట్టేద‌న్న స్టార్ డాట‌ర్
X
భార‌త దేశంలోని లెజెండ‌రీ న‌టుల‌లో అమితాబ్ బచ్చన్ ఒకరు. 80 వ‌య‌సులో ఆయ‌న ఇంకా ఎంతో చురుగ్గా సినిమాల్లో న‌టిస్తూ బ్లాగులు రాస్తూ సామాజిక మాధ్య‌మాల్లో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ఆయ‌న వార‌సులు సినీరంగంలో ఉన్నారు. బ‌చ్చ‌న్ జీ కుమార్తె శ్వేతా బచ్చన్ నందా సినిమాల్లోకి రాలేదు కానీ ఆమె సామాజిక కార్య‌క్ర‌మాల‌తో యాక్టివ్ సెల‌బ్రిటీగా పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందింది.

శ్వేత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను సినిమాల్లోకి రావడం త‌న త‌ల్లి జ‌యాబ‌చ్చ‌న్ కి ఇష్టం లేదని తాను ఎదుగుతున్న క్ర‌మంలో చాలా కఠినమైన తల్లిగా కండీష‌న్లు పెట్టేద‌ని వెల్లడించింది.

ఇంట్లో నిబంధనలు ఉల్లంఘించినప్పుడు తన తల్లి తనను చాలా సార్లు చెంపదెబ్బలు కొట్టేదని.. తన సోదరుడు అభిషేక్ బచ్చన్ మౌనంగా చూస్తూ తప్పించుకునేవాడని శ్వేత వెల్ల‌డించింది.

శ్వేత కూతురు నవ్య త్వరలో హిందీలో అరంగేట్రం చేయనుందనే విష‌యం తెలిసింది త‌క్కువ మందికే. అమితాబ్ మ‌న‌వ‌రాలి సినీఆరంగేట్రంపై ఉత్కంఠ నెల‌కొంది. ఆమె ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. జాన్వీ-ఖుషీ- సుహానా లాంటి న‌ట‌వార‌సుల ఎంట్రీ త‌ర్వాత అతిపెద్ద లాంచింగ్ ను బ‌చ్చ‌న్ ల కుటుంబం కోరుకుంటోంద‌ని స‌మాచారం.

యువహీరోతో ప్రేమాయ‌ణంలో?శ్వేతా బ‌చ్చ‌న్ నందా వార‌సురాలు నవ్య నవేలి నందా పాపుల‌ర్ యంగ్ హీరో 'గ‌ల్లీ బోయ్' ఫేం సిద్ధాంత్ చతుర్వేదితో ప్రేమాయ‌ణం సాగిస్తోంద‌ని ఇటీవ‌ల గుస‌గుస‌లు వినిపించాయి. కానీ ఇంత‌లోనే నవ్య నవేలి నంద- సిద్ధాంత్ చతుర్వేది మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు కూడా వినిపించాయి.

వారి నిరంతర సోషల్ మీడియాల‌ను ప‌రిశీలిస్తే.. మార్పు చేర్పులు సందేహానికి కార‌ణ‌మ‌య్యాయి. ఈ జంట‌ ప్రేమలో ఉన్నారని కానీ ఇంకా ఏదో జ‌రుగుతోంద‌ని నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.