Begin typing your search above and press return to search.

మొత్తానికి రకుల్ ని ఇలా చూపించారు

By:  Tupaki Desk   |   27 Jan 2018 12:21 PM IST
మొత్తానికి రకుల్ ని ఇలా చూపించారు
X
నార్త్ ఇండియన్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు సౌత్ అభిమానులను చాలా వరకు మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తరహాలో బాలీవుడ్ అభిమానులను కూడా తనవైపు తిప్పుకోవాలని చాలా ప్రయత్నాలను చేస్తోంది. త్వరలో అయారి సినిమా ద్వారా అక్కడి తెరపై అలరించడానికి సిద్ధమయ్యింది. అయితే సినిమా ప్రమోషన్స్ విషయంలో అమ్మడు అందరికంటే ఎక్కువగా బుధ్యతను తనపై వేసుకుంది.

ఎక్కడికి వెళ్లినా ప్రమోషన్స్ ని తనే చేస్తోంది. ఇకపోతే సినిమాలో రకుల్ పాత్ర గురించి కొన్ని రూమర్స్ చాలానే వస్తున్నాయి. ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ కి అంతగా ఇంపార్టెంట్ ఏమి లేదని టాక్. ఎదో చిన్న పాత్ర అని అక్కడి మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. అంతే కాకుండా ట్రైలర్లో కూడా కొన్ని షాట్స్ లోనే కనిపించింది. ఆమెను ఎక్కువగా చూపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక సాంగ్ లో కొంచెం ఎక్కువగానే చూపించారు.

ప్రమోషన్స్ కోసం ఎక్కువగా కష్టపడుతోంది అనుకున్నారో ఏమో గాని ఫైనల్ గా సినిమా ప్రమోషన్స్ సాంగ్ లో రకుల్ ని స్టైలిష్ గా చూపించారు. పాట మొత్తంగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంది. మేకింగ్ రాకింగ్ అనేలా ఉంది. సినిమాపై ప్రస్తుతం ఓ తరహాలో అంచనాలు మాత్రం బాగానే ఉన్నాయి. అయితే రిలీజ్ తరువాత టాక్ వస్తే మంచి హిట్ అవుతుందని సినీ పండితులు చెబుతున్నారు. ఇక సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.