Begin typing your search above and press return to search.
కారు డ్రైవర్ గా పని చేయడానికి సిద్ధపడ్డాను!
By: Tupaki Desk | 22 Oct 2021 8:27 AM IST'శుభలేఖ' సుధాకర్ .. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాల్లో ఆయన కీలకమైన పాత్రలను చేశారు .. చేస్తున్నారు. సముద్రమన్నాక కెరటాలు .. జీవితమన్నాక కష్టాలు ఉంటూనే ఉంటాయి. అలాంటి కష్టాలు తనని కూడా సతమతం చేశాయంటూ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే .. "నటుడిగా నేను నా కెరియర్ ను మొదలుపెట్టి 40 ఏళ్లు అయింది. జీవితంలో సుఖం ఉంటుంది .. కష్టం ఉంటుంది. ఈ రెండు కూడా మన జీవితంలో రైలు పట్టాల మాదిరిగా సమానంగా కనిపిస్తూనే ఉంటాయి.
నేను యాక్టర్ ను కావాలనే ఉద్దేశంతో మద్రాసు వచ్చినప్పుడు ఒక చీపురు పుల్ల మాదిరిగా ఉండేవాడిని. 'ఉఫ్' అంటే ఎగిరిపోయేలా ఉండేవాడిని. అలాంటి నేను నటుడిగా ఇంత కాలం ప్రయాణం చేస్తానని అనుకోలేదు. అదృష్టం .. తల్లిదండ్రుల ఆశీస్సుల వలన కెరియర్ అలా వెళ్లిపోయింది. పెళ్లి అయిన తరువాత ఒకానొక సమయంలో ఏం చేయాలో పాలుపోని ఒకరకమైన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో టెలివిజన్ అనే ఒక వరప్రసాదం దొరికింది. అక్కడి నుంచి మరో ప్రయాణం మొదలైంది.
నేను సినిమాలు చేయకపోయినా ఇంకా జనాలు గుర్తుపెట్టుకోవడానికి కారణం టెలివిజన్. సినిమాలు లేకపోవడంతో .. వర్క్ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడిపోయాను. 'ఏంటి ఇలా అయిపోయింది' అని ఆలోచనలో పడ్డాను. నాకు అవకాశాలు రాకపోవడంతో నాలో ఏదైనా తప్పు ఉందా? అని ఆలోచించాను. షూటింగుకు సమయానికి వెళతాను .. దర్శకులు చెప్పినట్టుగానే డెలివర్ చేస్తాను .. ఆడియన్స్ కి నచ్చుతూనే ఉన్నాను. పోనీ ఏమైనా డిమాండ్ చేశానా అంటే అదీ లేదు. అయినా అవకాశాలు రావడం లేదంటే .. టైమ్ .. బ్యాడ్ టైమ్ .. అప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు.
సినిమాలు చేసిన నేను .. టెలివిజన్ లో చేయవలసి వచ్చిందే అని ఎప్పుడూ ఫీల్ కాలేదు. పని లేనివాడికి పని వచ్చింది .. సీరియల్స్ చేయడం వలన కూడా సినిమాలు రావొచ్చు అనిపించింది. సీరియల్స్ లో కూడా మంచి మంచి పాత్రలు పడ్డాయి. ఏడాదిన్నర పాటు నాకు వర్క్ లేనప్పుడు నేను అంతకు ముందు ఏదైతే హోటల్లో పనిచేశానో అదే హోటల్ కి వెళ్లి పని అడిగాను .. వాళ్లు నవ్వేశారు. నా క్లాస్ మేట్స్ కొంతమంది హోమ్ బిజినెస్ చేస్తున్నారు .. వాళ్లను పని అడిగాను. అవసరమైతే కారు డ్రైవర్ గా పనిచేస్తానని అన్నాను .. వాళ్లు కూడా నవ్వేశారు. అప్పటికి నేను 90 సినిమాలు చేశాను" అని చెప్పుకొచ్చారు.