Begin typing your search above and press return to search.

#NBK107 మాస్ హీరోయిన్ తో మ‌స్త్ ఎంజాయ్ గురూ!

By:  Tupaki Desk   |   18 Jun 2022 5:30 PM GMT
#NBK107 మాస్ హీరోయిన్ తో మ‌స్త్ ఎంజాయ్ గురూ!
X
నటసింహ నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని భారీ ప్ర‌యోగం చేస్తుండ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. #NBK107 అత్యంత భారీ బ‌డ్జెట్ తో లావిష్ గా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. భారీ మాస్ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా మ‌లిచి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని గోపిచంద్ క‌సిగా ప‌ని చేస్తున్నాడు. అత‌డి విజ‌న్ కి త‌గ్గ‌ట్టే రాజీ అన్న‌దే లేకుండా మైత్రీ మూవీ మేకర్స్ అన్నివిధాలా స‌హ‌క‌రిస్తోంది.

ఇంత‌కుముందు ఎన్బీకే పుట్టినరోజు స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయ‌గా నంద‌మూరి ఫ్యాన్స్ పూన‌కంతో ఊగిపోయిన సంగ‌తి తెలిసిందే. బాల‌య్య బాబు నుంచి ఏం ఆశిస్తారో అలాంటి సినిమానే గోపిచంద్ తెర‌కెక్కిస్తున్నార‌ని ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. మ‌రోవైపు ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ లాంటి మాస్ హీరోయిన్ ని న‌టింప‌జేస్తూ గోపిచంద్ హీట్ పెంచుతున్నాడు. బ‌లుపు - క్రాక్ లాంటి హిట్ చిత్రాల్లో న‌టించిన శ్రుతిహాస‌న్ ఇప్పుడు మ‌రోసారి గోపిచంద్ తో క‌లిసి ప‌ని చేస్తోంది. ఇక ఈ జోడీ సెట్స్ లో అన్ లిమిటెడ్ ఫ‌న్ ని ఆస్వాధిస్తున్నారు.

షూటింగ్ అంటే జాలీ రైడ్ అన్న‌దానికి ఇది సింబాలిక్ గా క‌నిపిస్తోంది. ఆన్ లొకేషన్ నుంచి తాజాగా ఓ ఫోటోగ్రాఫ్ ని గోపిచంద్ షేర్ చేసారు. గోపిచంద్ మ‌లినేని సెట్స్ లో మానిట‌ర్ ముందు సీన్ ని జ‌స్టిఫై చేస్తుంటే అత‌డి చెంత‌నే కూచుని శ్రుతి ఇదిగో ఇలా కెమెరాకి ఫోజిచ్చింది. శ్రుతిలోని మాసిజానికి ఇది సింబాలిక్ అని చెప్పాలి. ఈ ఫోటోని చూడ‌గానే అభిమానులు కూడా అంతే రెచ్చిపోయారు. ``కొంచెం వాడ‌వ‌య్యా మాస్ హీరోయిన్ ని .. బ‌లుపు లాగా బీసీ కేంద్రాలు క‌ళ‌క‌ళ‌లాడిపోతాయ్`` అంటూ అభిమానులు స్పందిస్తున్నారు.

నంద‌మూరి బాలకృష్ణ ఈ మూవీలో ఎదురేలేని వాడిగా క‌నిపించ‌నున్నారు. న‌మ్మిన వారి కోసం ఎంత‌దాకా అయినా వెళ్లే జెంటిల్మ‌న్ గా అత‌డు క‌నిపించ‌నున్నారు. అత‌డు అండా దండా బ‌ల‌గం ఉన్న పెద్ద‌మ‌నిషిగా ఈ చిత్రంలో కనిపించ‌నున్నారు. బాలకృష్ణ అభిమానులకు మాస్ ఫీస్ట్ ఖాయ‌మ‌ని కూడా పోస్ట‌ర్లు వెల్ల‌డిస్తున్నాయి.

ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ ని సాధించింది. ఎన్బీకే పాత్రను పవర్ ఫుల్ గా డిజైన్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని లుక్స్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ చిత్రంలో దునియా విజయ్- వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండ‌గా.. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నవీన్ యెర్నేని- వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిట‌ర్ నవీన్ నూలి ఎడిటింగ్ వ‌ర్క్ ని.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ వ‌ర్క్ ని అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఫైట్స్ రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు. ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.