Begin typing your search above and press return to search.

వీడియో: వామ్మో! మంత్ర‌గ‌త్తెగా మారిన శ్రుతి!!

By:  Tupaki Desk   |   20 April 2021 7:38 AM GMT
వీడియో: వామ్మో! మంత్ర‌గ‌త్తెగా మారిన శ్రుతి!!
X
కెరీర్ ప‌రంగా వ్య‌క్తిగ‌త జీవితం ప‌రంగా ప్ర‌యోగాలు చేసేందుకు శ్రుతిహాస‌న్ వెన‌కాడ‌దు. ఆమె పోక‌డ‌ గ‌మ‌నించిన ఎవ‌రైనా చెప్పేది ఇదే. ఇంత‌కుముందు క‌థానాయిక‌గా అసాధార‌ణ‌ స్టార్ డ‌మ్ అందుకున్నాక స‌డెన్ గా వ్య‌క్తిగ‌త జీవితం ముఖ్యం! అంటూ మైఖేల్ కోర్స‌లే కోసం సినీప‌రిశ్ర‌మ‌ల్ని వీడిన మాట నిజం. అత‌డి ప్రేమ వ్యామోహంలో ప‌రిణామాలు పూర్తిగా త‌న వ్య‌క్తిగ‌తం అనుకుంటే... ఇప్పుడు కెరీర్ ప‌రంగా తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఎంతో నిజాయితీగా శ్ర‌మిస్తోంది. అందుకు త‌గ్గ ఫ‌లితం కూడా ద‌క్కుతోంది.

క్రాక్- వ‌కీల్ సాబ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో శ్రుతి కంబ్యాక్ నిజంగానే అదిరింది. ఇప్పుడు త‌న జీవితంలోకి స్నేహితుడు డూడుల్ ఆర్టిస్టు శంత‌ను ప్ర‌వేశంతో మ‌రో లెవ‌ల్ క‌ల‌ర్ యాడైంది. ఇక త‌న జీవితంలో ప్ర‌తి క‌ల‌ర్ ని ఇదిగో ఇలా ఫోటోషూట్ల రూపంలోనూ శ్రుతి ఎలివేట్ చేస్తోంది.

లైఫ్ అంటేనే మంత్ర‌గత్తె త‌ర‌హా. అందుకే ఇదిగో ఇలా మాంత్రికురాలిలా మారిపోయి భ‌య‌పెట్టేస్తోంది. శ్రుతి వేష‌ధార‌ణ లుక్ ప్ర‌తిదీ మారిపోయింది. ర‌క‌ర‌కాల ఎక్స్ ప్రెష‌న్స్ తో ఎంత‌గా భ‌య‌పెట్టేస్తోందో ఈ వీడియో చూస్తే అవ‌గ‌త‌మ‌వుతోంది. డార్క్ రెడ్ లో కాన్సెప్ట్ ఫోటోషూట్ థీమ్ అదిరిపోయింది! అంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రుతి ఆ కురుల‌ను ఆర‌బోస్తూ ప్ర‌ద‌ర్శించిన హావ‌భావాలు కిల్ చేస్తున్నాయి అంటే అతిశ‌యోక్తి కాదు. ప్రస్తుతం యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది ఈ వీడియో. త‌దుప‌రి ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రంలో శ్రుతి క‌థానాయిక‌గా క‌నిపించ‌నుంది.