Begin typing your search above and press return to search.

సలార్ బ్యూటీ దోరదోర ద్రాక్షపండు అందాలతో ఊరిస్తోందిగా..!!

By:  Tupaki Desk   |   18 Feb 2021 2:30 AM GMT
సలార్ బ్యూటీ దోరదోర ద్రాక్షపండు అందాలతో ఊరిస్తోందిగా..!!
X
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో మోస్ట్ బిజీ హీరోయిన్ అయిపోయింది. ఎందుకంటే క్రాక్ సినిమా ముందువరకు ఈ అమ్మడి చేతిలో కేవలం ఒకే సినిమా ఉంది. కానీ ఎప్పుడైతే క్రాక్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిందో.. అప్పటినుండి శృతికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ వయ్యారి చేతిలో అటు విజయ్ సేతుపతి లాభం సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలు ఉన్నాయి. అలాగే త్వరలో నెట్ ఫ్లిక్స్ నిర్మించిన తెలుగు పిట్టకథలు అనే వెబ్ సిరీస్ తో ఓటిటిలో కనిపించనుంది. పిట్టకథలు వెబ్ సిరీస్ లో శృతి ఫస్ట్ టైం ఓ బోల్డ్ లెస్బియన్ క్యారెక్టర్ పోషించినట్లు తెలుస్తుంది. మొత్తానికి శృతి కెరీర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే అని హ్యాపీగా ఉందట.

ఇదిలా ఉండగా.. శృతిలో మరో యాంగిల్ కూడా ఉంది. అదే గ్లామర్ షో యాంగిల్. సినిమాలు కాస్త వెనకాముందు కావచ్చేమో గాని ఈ అమ్మడి అందాల ఆరబోత మాత్రం అసలు ఆలస్యం కాకుండా చూసుకుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో దాచిపెట్టిన అందాలన్నీ ఒక్కొక్కటిగా అభిమానులకు విందు చేస్తోంది. శృతికి సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. అందుకే ఇంస్టాగ్రామ్ లో తాజాగా ఓ గ్లామరస్ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో శృతి టోటల్ టాప్ టు బాటమ్ బ్లాక్ కాంబినేషన్లో మురిపిస్తోంది. స్టైలిష్ మినీ బ్లాక్ ఫ్రాక్ లో అమ్మడు దోరని ద్రాక్షపండులా ఊరిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మొత్తానికి డార్లింగ్ ప్రభాస్ సరసన నటించాలనే శృతి కోరిక సలార్ తో నెరవేరుతోంది. చూడాలి మరి సలార్ బ్యూటీ మేజిక్ ఎలా ఉండబోతుందో!