Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ అభిమానుల క్ల‌బ్ లో చేరిన శ్రుతి

By:  Tupaki Desk   |   27 May 2021 10:00 PM IST
ప్ర‌భాస్ అభిమానుల క్ల‌బ్ లో చేరిన శ్రుతి
X
డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్ క్ల‌బ్ లో క‌థానాయిక‌ల జాబితా తిర‌గేస్తే అది చాలా పెద్ద‌ది. అత‌డి స‌ర‌స‌న న‌టించిన క‌థానాయిక‌లంతా త‌న‌తో స్నేహానికి ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. అనుష్క‌- కాజ‌ల్ - త్రిష‌- త‌మ‌న్నా లాంటి టాప్ నాయిక‌లు అత‌డి అభిమానులు. సాహో శ్ర‌ద్ధ‌.. రాధే శ్యామ్ పూజా హెగ్డే కూడా ఇప్ప‌టికే అత‌డి అభిమాన సంఘంలో చేరారు.

ఇప్పుడు స‌లార్ లో న‌టిస్తున్న శ్రుతిహాస‌న్ కూడా త‌న ఫ్యాన్ క్ల‌బ్ లోనే చేరింది. క్రాక్ -వ‌కీల్ సాబ్ త‌ర్వాత శ్రుతికి టాలీవుడ్ లో ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్ర‌మిది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ `సలార్` చిత్రీకరణను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

శ్రుతి కొద్దిరోజుల చిత్రీక‌ర‌ణ‌లో మాత్ర‌మే పాల్గొంది. ఇంత‌లోనే త‌ను ప్ర‌భాస్ కి అభిమానిగా మారిపోయింది. అత‌డి కంపానియ‌న్ ని ఎంతో ఇష్ట‌పడుతోంది. ప్ర‌భాస్ సామాజికంగా అంద‌రితో క‌లిసి పోయే వ్య‌క్తి అని .. ప్రభాస్ నుంచి చాలా పాజిటివిటీని సంగ్ర‌హించ‌గ‌ల‌మ‌ని తెలిపింది. అన్న‌ట్టు ప్ర‌భాస్ ని శ్రుతి మ‌రీ ఇంత‌గా పొగిడేస్తే శంత‌ను ఫీల‌వుతాడు క‌దా!అంటూ అభిమానులు స‌ర‌దాగా ఆట ప‌ట్టిస్తున్నారు. సోష‌ల్ మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు.

`సలార్` మొదటి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ పూర్త‌యింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే షూట్ ప్రారంభమవుతుంది. మ‌రోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో జాన్ అబ్ర‌హాం విల‌న్ గా న‌టిస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ప్ర‌భాస్ - జాన్ మ‌ధ్య హోరాహోరీ స‌లార్ లో ప్ర‌ధాన హైలైట్ గా నిలిచే వీలుంద‌ని భావిస్తున్నారు.