Begin typing your search above and press return to search.

శ్రుతి-శంత‌ను! ఎవ‌రు ముందు ప్ర‌పోజ్ చేశారు?

By:  Tupaki Desk   |   10 Jan 2022 7:30 AM GMT
శ్రుతి-శంత‌ను! ఎవ‌రు ముందు ప్ర‌పోజ్ చేశారు?
X
శ్రుతి హాస‌న్ ముంబైకి చెందిన ఆర్టిస్ట్ శంత‌ను హ‌జారికాతో రిలేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌త రెండేళ్లుగా ఈ అభిన‌వ జంట‌ పీక‌ల్లోతూ ప్రేమ‌లో మునిగితేలుతున్నారు. ప్ర‌స్తుతం ముంబైలోనే క‌లిసి ఉంటున్నారు. రిలేష‌న్ కి సంబంధించిన అప్ డేట్స్ ని సైతం శ్రుతి హాస‌న్ ఎప్ప‌ట‌కప్పుడు ఇన్ స్టా వేదిక‌గా చెబుతుంటుంది. తాజాగా ఈ జంట ఇన్ స్టా గ్రామ్ లో అభిమానుల‌తో చిట్ చాట్ లో పాల్గొంది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రిలో ఎవ‌రు ముందుగా ప్ర‌పోజ్ చేసారు? అన్న ప్ర‌శ్న ఎదురైంది. దీనికి శ్రుతి హాస‌న్ నే ముందుగా శంత‌న్ కి నేనే ప్ర‌పోజ్ చేశాన‌ని తెలిపింది. `ఐల‌వ్ యూ`అని చెప్పి త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ను శంత‌నుతో పంచుకుందిట‌.

అయితే మొద‌టి నుంచి శ్రుతి హాస‌న్ అంటే ఇష్టం అన్న భావ‌న‌లో శాంత‌ను ఉన్నాడ‌ట‌. ఆ ధైర్యంతోనే శ్రుతి హాస‌న్ మ‌రో ఆలోచ‌న లేకుండా ప్రేమ‌ను ఓపెన్ గా చెప్పేసిన‌ట్లు రివీల్ చేసింది. మొత్తానికి ఈ జంట ప్రేమాయ‌ణం ప్ర‌స్తుతానికి స‌జావుగానే సాగుతోంది. ఈ బ్యూటీ ప్రేమ‌లో ప‌డ‌టం ఇదే మొద‌టిసారి కాదు. ఇటాలియ‌న్ న‌టుడు మైకేల్ కోర్స‌లేతో శ్రుతి హాస‌న్ డీప్ ల‌వ్ ని సాగించింది. క‌మ‌ల్ హాసన్ కి కూడా మైఖెల్ ని ప‌రిచ‌యం చేసింది. పెళ్లి చేసుకుంటార‌ని కూడా ప్ర‌చారం సాగింది. కానీ ఏం జ‌రిగిందో ఏమో! ఒక్క‌సారిగా ఇద్ద‌రికీ బ్రేక‌ప్ జ‌రిగింది.

అలాగే ఓ కోలీవుడ్ న‌టుడు..టాలీవుడ్ నుటుడితోనూ శ్రుతి హాస‌న్ ప్రేమ‌లో ప‌డిన‌ట్లు మీడియాలో ప్ర‌చారం సాగింది. కానీ వాటికి సంబంధించి బ‌ల‌మైన ఆధారాలు అయితే లేవు. మైఖేల్ కోర్స‌లే త‌ర్వాత శంత‌నుతో ల‌వ్ ని ప‌బ్లిక్ చేసింది శ్రుతీ.

శ్రుతి హాస‌న్ సినిమాల విష‌యానికి వ‌స్తే పాన్ ఇండియా చిత్రం `స‌లార్` ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఇందులో శ్రుతి యాక్ష‌న్ క్వీన్ గా క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. అలాగే ఇటీవ‌లే బాల‌కృష్ణ స‌ర‌స‌న ఓ చిత్రానికి సంత‌కం చేసింది. మెగాస్టార్ చిరంజీవి-బాబి ప్రాజెక్ట్ లోనూ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంటోంద‌ని క‌థ‌నాలొచ్చాయి.