Begin typing your search above and press return to search.

సలార్ బ్యూటీ ఇంతలా హీటెక్కించాలా..??

By:  Tupaki Desk   |   21 May 2021 9:00 PM IST
సలార్ బ్యూటీ ఇంతలా హీటెక్కించాలా..??
X
సినీ ప్రపంచం అంటేనే గ్లామర్ అంశాలకు పెద్దపీట అనే సంగతి తెలిసిందే. అందులోను సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ షో అనేది ఇప్పుడిప్పుడే మరింత గ్లామర్ సంతరించుకుంటుంది. ఓవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ హాలీవుడ్ లెవెల్లో హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టైల్స్ - ఆటిట్యూడ్స్ చూస్తూనే ఉన్నాం. కానీ మన సౌత్ ఇండియాలో అలా కాదు. అవసరాన్ని బట్టి ఇక్కడ కూడా గ్లామర్ హద్దులు చెరిపేసి అదిరే అందాల ప్రదర్శన చేసే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ముందు వరుసలో ఉంటుంది. ఈ వయ్యారి వయ్యారాల గురించి టాలీవుడ్ గ్లామర్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే పదేళ్లుగా ఈ చెన్నై చంద్రం అందాలను ఆస్వాదిస్తూనే ఉన్నారు ప్రేక్షకులు.

అయితే ఆ మధ్యలో సినిమాలు కాదని లవ్ - బాయ్ ఫ్రెండ్ అంటూ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. కానీ కొద్దీ కాలానికే లవ్ లైఫ్ ఎండ్ అవ్వడంతో మళ్లీ ఇండియాకు తిరిగివచ్చి సినిమాలు చేయడం ప్రారంభించింది. అలా వచ్చిందో లేదో అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం వయ్యారి చేతిలో పాన్ ఇండియా మూవీస్ కూడా ఉన్నాయి. మొదటినుండి శృతి ఆటిట్యూడ్ చాలా క్యూట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా షో ఆఫ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఆ ఆటిట్యూడ్ కేవలం షూట్స్ అప్పుడు మాత్రమే బయటపెడుతుంది. అమ్మడు ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ సాలిడ్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతోంది.

ఇదివరకు శృతి ఏ భాషకు ఆ భాషే అన్నట్టుగా సినిమాలు చేసింది. కానీ ఫస్ట్ టైం ఒకే సినిమాతో పాన్ ఇండియాకు పరిచయం కాబోతుంది. మూడేళ్లు గ్యాప్ తీసుకొని రీఎంట్రీ చేసిన శృతి అదృష్టం మాములుగా లేదని టాక్. వచ్చిరాగానే క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే ప్రభాస్ తో సలార్ సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకుంది. అలాగే వకీల్ సాబ్ తో పవన్ తో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకుంది. ఇదిలా ఉండగా.. శృతికి గ్లామర్ షో చేయడం ఫోటోషూట్స్ అంటే చాలా సరదా. అందుకే ఎప్పటికప్పుడు న్యూ స్టైలిష్ ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ గుండెలు కొల్లగొడుతుంది. తాజాగా అమ్మడు ఓ స్పంకీ టైప్ ఫోటోషూట్ చేసింది. ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ బ్లాక్ అవుట్ ఫిట్ లో అమ్మడు టాప్ టు బాటమ్ అందాలను ఎరగా వేసిందని చెప్పవచ్చు. అందుకే ఫ్యాన్స్ ఇంత హాట్ అయితే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.