Begin typing your search above and press return to search.

షాపులో గుట్టు చ‌ప్పుడు కాకుండా శ్రుతి చేసిన చిలిపి ప‌ని!

By:  Tupaki Desk   |   18 July 2021 8:28 AM GMT
షాపులో గుట్టు చ‌ప్పుడు కాకుండా శ్రుతి చేసిన చిలిపి ప‌ని!
X
వృత్తిగ‌త జీవితంతో సంబంధం లేకుండా వ్య‌క్తిగ‌త జీవితానికి ప్రాధాన్య‌త‌నిచ్చే న‌టిగా శ్రుతిహాస‌న్ కి గుర్తింపు ఉంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే మైఖేల్ కోర్స‌లేతో డేటింగ్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఆ త‌ర్వాత అనూహ్యంగా బ్రేక‌ప్ అనంత‌ర ప‌రిణామాలు తెలిసిన‌వే.

ప్ర‌స్తుతం డూడుల్ ఆర్టిస్ట్ శంత‌ను హజారికతో శ్రుతి ప్రేమ‌లో ఉంది. తాజాగా ఓ బ‌హిరంగ మార్కెట్లో షాపింగ్ చేస్తూ శంత‌నును ఘాడంగా హ‌త్తుకుని డీప్ లిప్ లాక్ వేస్తున్న ఫోటోగ్రాఫ్ ని శ్రుతి సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. ఆ ఇద్ద‌రూ మాస్కులు ధ‌రించి క‌నిపిస్తున్నారు. రిటైల్ దుకాణంలో ఆ ఇద్ద‌రూ అలా చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ ఫోటోని ఇలా షేర్ చేయ‌గానే అలా అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

గ‌త కొంత‌కాలంగా కొత్త బోయ్ ఫ్రెండ్ శంత‌ను హ‌జారికా లోకంలోనే జీవిస్తున్న శ్రుతి ఎప్ప‌టికప్పుడు అత‌డితో సెల్ఫీల‌ను షేర్ చేస్తుంటే అవ‌న్నీ వైర‌ల్ గా మారుతున్నాయి. ఈ అందాల భామ అతడి సాంగ‌త్యంలో అన్నిటినీ మైమ‌రిచిపోతోంది. ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే క్రాక్ - వ‌కీల్ సాబ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ఎవ‌రికీ సాధ్య‌ప‌డ‌ని గ్రేట్ కంబ్యాక్ తో అద‌ర‌గొట్టింది. ఇప్పుడు స‌లార్ లాంటి పాన్ ఇండియా సినిమాలో న‌టించేస్తూ మ‌రింత‌గా వేడి పెంచేస్తోంది. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా కేజీఎఫ్ పేం ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
విజయ్ సేతుపతి బహు భాషా చిత్రం లాభం లోనూ న‌టిస్తోంది.