Begin typing your search above and press return to search.

శృతి తన పాత వ్యాఖ్యలకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది

By:  Tupaki Desk   |   17 Feb 2021 10:30 AM GMT
శృతి తన పాత వ్యాఖ్యలకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది
X
న్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ మూవీ రూపొందుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న సలార్‌ మూవీలో శృతి హాసన్ ను హీరోయిన్‌ గా ఎంపిక చేశారు. ఈ సమయంలో శృతి దాదాపు నాలుగు ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె చేసిన ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ ను తెగ షేర్‌ చేస్తున్న కన్నడ సినీ ప్రేమికులు మరియు నెటిజన్స్‌ గతంలో కన్నడ సినిమాలు చేయను అంటూ చెప్పిన శృతి హాసన్ ఇప్పుడు ఎందుకు కన్నడ దర్శకుడితో చేస్తుంది అంటూ విమర్శలు చేస్తున్నారు. గతంలో నచ్చని కన్నడ సినిమా పరిశ్రమ ఇప్పుడు ఎలా పనికి వచ్చినందని విమర్శలు చేస్తున్నారు. తన పై వస్తున్న విమర్శలకు శృతి సమాధానం ఇచ్చింది.

తాను గతంలో కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా డేట్లు కుదరక నటించలేక పోయాను. అంతే తప్ప కన్నడ సినిమా పరిశ్రమ అంటే ఎలాంటి చిన్న చూపు లేదు. సలార్‌ కథ మరియు సినిమాలో నా పాత్ర అన్ని నాకు బాగా నచ్చాయి. కనుక నటించేందుకు ఒప్పుకున్నాను అంది. అన్ని భాషల సినిమా పరిశ్రమలు మరియు అన్ని భాషలకు చెందిన నటీ నటులు మరియు టెక్నీషియన్స్ అంటే నాకు అమితమైన గౌరవం ఉందని చెప్పింది. ప్రస్తుతం ఈమె సలార్‌ సినిమాతో పాటు హిందీలో కూడా ఒక సినిమాను చేస్తుంది. మల్టీ ట్యాలెంటెడ్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న శృతి హాసన్‌ ఇటీవలే క్రాక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.