Begin typing your search above and press return to search.

భాగ్య‌ల‌క్ష్మి దృష్టి తెలుగు ప‌రిశ్ర‌మ‌పైనే..!

By:  Tupaki Desk   |   2 April 2022 11:30 AM GMT
భాగ్య‌ల‌క్ష్మి దృష్టి తెలుగు ప‌రిశ్ర‌మ‌పైనే..!
X
బ్యాక్ టు బ్యాక్ హిట్లతో శ్రుతి హాస‌న్ మాంచి జోష్ మీద ఉంది. కంబ్యాక్ లో అద‌ర‌గొట్టి వ‌రుస‌గా క్రేజీ సినిమాల్లో న‌టిస్తోంది. ల‌వ్ బ్రేక‌ప్ అనంత‌రం డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డిన శృతి గతేడాది క్రాక్ తో టాలీవుడ్‌కి తిరిగి వచ్చింది. తరువాత వకీల్ సాబ్ లో కనిపించింది. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి.

శ్రుతి ప్రాజెక్టుల‌ను ప‌రిశీలిస్తే.. ప్రభాస్ తో కలిసి సలార్.. నందమూరి బాలకృష్ణతో ఎన్.బీ.కే 107 .. మెగాస్టార్ చిరంజీవి 154లో నటిస్తోంది. ఆమె మరికొన్ని భారీ బడ్జెట్ తెలుగు చిత్రాల కోసం కూడా చర్చలు జరుపుతోంది. టాలీవుడ్ లో బిజీగా ఉన్నా కానీ ఎందుక‌నో హిందీ తమిళ భాషల్లో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. రీఎంట్రీలో శృతి హిందీ వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఒక తమిళ చిత్రంలో నటించింది. ఆ రెండు ప‌రిశ్ర‌మ‌లు శ్రుతికి పెద్ద‌గా క‌లిసి రాలేదు. అందుకే తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను విడిచిపెట్ట‌డం లేదు.

ఇటీవ‌ల‌ తెలుగు చిత్రాలపైనే దృష్టి పెట్టడానికి కారణం అదేనా? అంటూ చ‌ర్చ సాగుతోంది. ఇక క‌మ‌ల్ హాస‌న్ అంటే తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ఎంతో గౌర‌వం. దాని దృష్ట్యా కూడా మ‌న మేక‌ర్స్ శ్రుతిని ఎంక‌రేజ్ చేస్తున్నార‌ని భావించాల్సి ఉంటుంది. సినిమాల‌తో పాటు మ‌రో వైపు గోథిక్ మేక‌ప్ విధానాల‌కు ప్ర‌చారం చేస్తున్న శ్రుతి వ‌రుస ఫోటోషూట్ల‌తో మంట‌లు పుట్టిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.