Begin typing your search above and press return to search.

పాప్ స్టార్ అయిపోతుందా ఏంటి?

By:  Tupaki Desk   |   3 Oct 2017 11:37 AM IST
పాప్ స్టార్ అయిపోతుందా ఏంటి?
X
చాలామంది హీరోలు హీరోయిన్లు యాక్టింగ్ ఒక్కటే ప్రపంచం అనుకుంటారు. ఇక యాక్టింగ్ ఛాన్సులు తగ్గిపోతే కొందరు ఏదన్నా బిజినెస్ లోకి షిఫ్ట్ అయితే.. కొందరు మాత్రం ప్రాణాలు కూడా తీసుకున్నారు. అయితే హీరోయిన్లు మాత్రం చివర వరకు ఎలాగొలా యాక్టింగ్ ఛాన్సులు తెచ్చుకోవాలనే చూస్తుంటారు. అవసరమైన డైరక్టర్లను ప్రొడ్యూసర్లను వేరే విధంగా కూడా ఇంప్రెస్ చేయడానికి వెనకాడట్లేదు. కాని ఒక స్టార్ హీరోయిన్ మాత్రం.. 'అంత సీన్ లేదు' అనేస్తోంది.

సీనియర్ బ్యూటి శృతి హాసన్.. తెలుగులో శ్రీమంతుడు తరువాత కాటమరాయుడులో మెరిసింది. ఆమె 'ఊ' అంటే చాలు.. చాలామంది తెలుగు సూపర్ స్టార్లు ఆమెనే పెట్టుకుంటారు. కాకపోతే చాలా సినిమాలను వదిలేసుకుని మరీ 'సంఘమిత్ర' సినిమాకు డేట్లు ఇచ్చింది. కాని కత్తియుద్దాలు వంటివి ప్రాక్టీస్ చేసిన తరువాత కూడా కటిఫ్‌ చెప్పేసి ఆ సినిమా నుండి బయటకు వచ్చేసింది. అయితే అలా వచ్చేయడం వలన ఇతర పెద్దపెద్ద హీరోలు కూడా మీకు ఛాన్సులు ఇవ్వట్లేదు కదా అని అడిగితే.. 'అసలు యాక్టింగ్ అవకాశాలు వస్తేనే నేను సర్వైవ్ అవుతానా? యాక్టింగ్ కాకుండా నాకు ఇంకా చాలా టాలెంట్లు ఉన్నాయి కదా' అనేసింది అమ్మడు.

అవును.. అసలు హీరోయిన్ అవ్వకముందే శృతి ఒక మ్యూజిక్ డైరక్టర్ గా చేసింది. పైగా తన ప్రియుడు కూడా ఒక సింగర్ కమ్ మ్యూజిక్ ప్లేయరే. కాబట్టి ఇద్దరూ కలసి ఏదన్నా ట్రూప్ స్టార్ట్ చేసి ఆర్కెస్ర్టా మోత మోగించినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. 60కు దగ్గరపడిన మడోన్నాను.. 50కు దగ్గర పడిన జెన్నిఫర్ లోపెజ్ ను జనాలు ఆదరిస్తున్నారుగా.. సో ఒక విధంగా హీరోయిన్ గా కంటే పాప్ స్టార్ అవ్వడమే బెటర్ అనుకున్నావా శృతి?