Begin typing your search above and press return to search.

నా ఫస్టు బాయ్‌ ఫ్రెండ్ మంచోడు

By:  Tupaki Desk   |   29 Jun 2016 11:00 PM IST
నా ఫస్టు బాయ్‌ ఫ్రెండ్ మంచోడు
X
మామూలుగా మన హీరోయిన్లు తమ ప్రస్తుత బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరు అంటేనే నోరు విప్పరు. బాలీవుడ్‌ మాదిరి ఇక్కడ డేర్ చేసి అస్సలు చెప్పరులే. అయితే సెక్సిణి శృతి హాసన్ మాత్రం.. తాను ఖచ్చితంగా అలాంటి విషయాలను పెద్దగా గోప్యంగా ఉంచనని.. మహా అయితే పేర్లు చెప్పనేమో గాని ఎఫైర్ల గురించి బయటెట్టేస్తాను అంటోంది.

ఫెమినీ మ్యాగజైన్ కొత్త ఎడిషన్ కు ఇంటర్యూ ఇచ్చిన శృతి హాసన్‌.. ఆ కవర్‌ పేజీల మీద హాటుగా మెరుస్తూ హీటు పుట్టించడమే కాదు.. మరో ప్రక్కన ఇంటర్యూలో తన సమాధానాలతో కూడా ఓట్లు వేయించుకుంటోంది. అదిగో నీ ఫస్ట్ బాయ్‌ ఫ్రెండ్‌ గురించి చెప్పూ అంటే. ''అతను చాలా మంచోడు. ఒక సంగీత కళాకారుడు. మంచి పద్దతులు తెలిసినవాడు. ఇప్పటికే నాకు గుర్తున్నాడంటే చూడండి. చాలామంది అమ్మాయిలకు తొలి బాయ్‌ ఫ్రెండ్ అంటే చాలా భయంగా ఉంటుంది. నాకు అలాంటిదేం లేదు'' అంటూ చెప్పుకొచ్చింది మన బంగారం. బాగానే ఉంది.. మరి ఇంతకీ అతగాడితో ఎందుకు బ్రేకప్ అయినట్లో?

ఇకపోతే అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్ నుండి తిరుగు ప్రయాణం మొదలెట్టేసిందట శృతి హాసన్‌. మరి ఇండియా రాగానే పవన్‌ కళ్యాణ్‌ సినిమా షూటింగ్‌ లో ఏమైనా పాలుపంచుకుంటుందేమో చూడాలి.