Begin typing your search above and press return to search.

బాద్ షాహో చిత్రం నుంచి శృతి ఔట్..

By:  Tupaki Desk   |   10 Sep 2015 1:34 PM GMT
బాద్ షాహో చిత్రం నుంచి శృతి ఔట్..
X
అజయ్ దేవ్ గన్ తో కలిసి... శృతి హాసన్ బాద్ షాహో చిత్రంలో చేసేందుకు గతంలో అంగీకరించింది. అయితే.. ఇప్పుడీ మూవీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. తన కేరక్టర్ విషయంలో పక్కాగా ఉంటుంది శృతి. ఇంపార్టెన్స్ ఉండడం కంటే.. స్టోరీలైన్ లో తనకు చెప్పినట్లుగానే ఆన్ స్క్రీన్ లో ఉండాలనే విషయంలో.. కఠినంగానే ఉంటుంది. తేడా వస్తే మాత్రం.. గట్టిగానే క్వశ్చన్ చేస్తుంది. ఇఫ్పుడు బాద్ షాహో నుంచి బైటకు రావడానికి కారణం కూడా ఇదే అని తెలుస్తోంది.

డైరెక్టర్ మిలన్ లూథ్రియా స్టోరీ చెప్పినపుడు తన కేరక్టర్ నచ్చడంతోనే శృతి యాక్సెప్ట్ చేసిందట. అయితే.. స్టోరీలైన్ లో బాగానే ఉన్నా...ఫైనల్ స్క్రిప్ట్ కూడా అడిగిందట. కానీ.. తుది వెర్షన్ లో మాత్రం తనకు చెప్పినదానికి, స్క్రిప్ట్ లో ఉన్నదానికి చాలా తేడా ఉండడంతో.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చిందట శృతి. తన రోల్ ఇంతగా తగ్గిపోవడం, ప్రాధాన్యత లేకపోవడం ఈ భామకు నిరుత్సాహం కలిగించిందని ఆమె స్నిహిత వర్గాలు అంటున్నాయి. అయితే.. మిలన్ లూథ్రియా అంటే చాలా అభిమానమని, ప్రాధాన్యత ఉండే కేరక్టర్ అయితే చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం విశేషం.

గతంలో కూడా శృతి ఇలాగే పీవీపీ బ్యానర్ లో చేసే మూవీ నుంచి కూడా అర్ధాంతరంగా తప్పుకుంది. దీన్ని భర్తీ చేసేందుకు ఐటెం సాంగ్ కి కూడా సై అంది. చూస్తుంటే తండ్రికున్నంత పట్టుదల ఉన్నట్లుంది కేరక్టర్ విషయంలో.