Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : క్యూట్ అందాలతో కుమ్మేశావ్‌ అమ్మాయి

By:  Tupaki Desk   |   2 Nov 2021 5:02 AM GMT
పిక్ టాక్ : క్యూట్ అందాలతో కుమ్మేశావ్‌ అమ్మాయి
X
యూనివర్శిల్ స్టార్ కమల్‌ హాసన్‌ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా కూడా హీరోయిన్ గా సొంత ట్యాలెంట్ తోనే గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ శృతి హాసన్‌. హిందీ.. తెలుగు.. తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆమద్య మ్యూజిక్‌ ఆల్బమ్స్‌.. మ్యూజిక్ షో లు అంటూ సినిమాలను కాస్త దూరం పెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టినట్లుగా అనిపిస్తుంది. స్టేజ్ షో లు అంటే చాలా ఇష్టపడే శృతి హాసన్‌ గత కొన్ని రోజులుగా కరోనా వల్ల స్టేజ్ షో లను దూరం పెట్టిందనే టాక్ వినిపిస్తుంది. ఈ గ్యాప్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం ద్వారా డబ్బులు సంపాదించి.. ఆ తర్వాత మళ్లీ మ్యూజిక్ స్టేజ్ షో లు చేయాలని ఈ అమ్మడి కోరికగా సన్నిహితులు చెబుతున్నారు.

ఇక రెగ్యులర్ గా శృతి హాసన్‌ హాట్ ఫొటో షూట్స్ ను షేర్‌ చేస్తూ వస్తుంది. తాజాగా శృతి హాసన్‌ షేర్‌ చేసిన ఫొటోలు హాట్‌ గా ఏమీ లేవు.. కాని చాలా క్యూట్ గా ఉన్నాయంటూ టాక్ దక్కించుకుంది. క్యూట్‌ అందాలతో కుమ్మేస్తున్నావు అమ్మడు అంటూ నెటిజన్స్ ఈ ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున అందాల ప్రదర్శణ చేస్తున్న నీకు ఇలాంటి ఔట్ ఫిట్ కూడా చాలా బాగా సెట్ అయ్యిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కిటికి వద్ద నిల్చుని బయట అందాలను చూస్తున్నట్లుగా ఉన్న శృతి హాసన్ ఒక సినిమా కార్యక్రమం కోసం ఇలా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి శృతి హాసన్ ఇలాంటి ఔట్ ఫిట్ లో కూడా అందంగా క్యూట్ గా ఉందంటూ జనాలు నెటిజన్స్ ఈ ఫొటోలను కూడా తెగ వైరల్‌ చేస్తున్నారు.

శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె చేస్తున్న బిగ్గెస్ట్‌ మూవీ సలార్‌. కన్నడ స్టార్‌ డైరెక్టర్‌ కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిన ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సలార్ మూవీలో శృతి హాసన్ నటిస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర చాలా స్పెషల్‌ గా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. తెలుగు లో మరో రెండు సినిమాల్లో నటించేందుకు కూడా ఈమె ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు బాలీవుడ్‌ లో కూడా ఈమె సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటించే ఆసక్తి చూపిస్తోంది. మొత్తానికి నటిగా ఎంతో బిజీగా ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ కోసం అందాల వింధు ఫొటో షూట్‌ ను ఇలాంటి క్యూట్‌ ఫొటోలను కూడా షేర్‌ చేస్తూ వస్తోంది.