Begin typing your search above and press return to search.

శ్రుతి హాస‌న్ హిందీ వెబ్ సిరీస్ లో!

By:  Tupaki Desk   |   30 Aug 2021 7:23 AM GMT
శ్రుతి హాస‌న్  హిందీ వెబ్ సిరీస్ లో!
X
ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ల‌కు ద‌క్కుతోన్న ఆద‌ర‌ణ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. లాక్ డౌన్ త‌ర్వాత భార‌త‌దేశంలో ఓటీటీ వ్యాపారం అంత‌కంత‌కు విస్త‌రించ‌డంతో వెబ్ సిరీస్ లకు..డాక్యుమెంట‌రీల‌కు మ‌రింత డిమాండ్ ఏర్ప‌డింది. అందుకే సీనియ‌ర్ హీరోయిన్ల ద‌గ్గ‌ర నుంచి న‌వ‌త‌రం నాయిక‌ల వ‌ర‌కూ వెబ్ సిరీస్ ల్లో న‌టించ‌డానికి అమితాస‌క్తి చూపిస్తున్నారు. ఒక సినిమా ద్వారా వ‌చ్చే పారితోషి కం క‌న్నా రెట్టింపు ఆదాయం వెబ్ సిరీస్ ల ద్వారా సంపాదిస్తున్నారు. పేరుకు పేరు డ‌బ్బుకు రెండు ఒకే వేదిక‌పై దొరుకుతున్నా యి. తాజాగా శ్రుతి హాస‌న్ కూడా వెబ్ సిరీస్ ల స్పీడ్ పెంచిన‌ట్లు తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `పిట్ట క‌థ‌లు` ద్వారా వెబ్ సిరీస్ లోకి ఎంట్రి ఇచ్చిన అమ్మ‌డు అటుపై మ‌రో వెబ్ సిరీస్ లో న‌టించలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా హిందీ వెబ్ సిరీస్ ల్లో న‌టించ‌డానికి అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం చేసుకుంది. సిరీస్ కి సంబంధించిన వివ‌రాలు రివీల్ చేయ‌లేదు గానీ.. ఓ ఇంట‌ర్వ్యూలో అమెజాన్ తో ఒప్పందం చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వెండి తెర‌పై మ‌ల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ గా వెలిగిపోయిన శ్రుతి వెబ్ సిరీస్ ల వ‌ర‌ల్డ్ లోనూ త‌న మార్క్ చూపించ‌డం ఖాయం. ఇప్ప‌టికే అడ‌ల్ట్ కంటెంట్ జాన‌ర్ ని ట‌చ్ చేయ‌డం అమ్మ‌డికి కొత్తేం కాదు. బాలీవుడ్ లో కెరీర్ ఆరంభంలోనే డిడేలో శృంగార స‌న్నివేశాలు శ్రుతి చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో వెబ్ సిరీస్ ల‌కు కావాల్సినంత త‌న‌లో హాట్ కంటెంట్ ని ఎలివేట్ చేయ‌డానికి ఎంత‌మాత్రం వెన‌క‌డుగు వేయ‌దు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో శ్రుతి హాస‌న్ పాన్ ఇండియా చిత్రం `స‌లార్` లో న‌టిస్తోంది. ఇందులో ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్నారు. కేజీ ఎఫ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ లో హంబోలే ఫిలింస్ చిత్రాన్ని నిర్మిస్తుంది.