Begin typing your search above and press return to search.

అయ్యో.. శ్రుతి సీన్ రివ‌ర్స‌య్యిందే!

By:  Tupaki Desk   |   21 Jun 2016 11:00 PM IST
అయ్యో.. శ్రుతి సీన్ రివ‌ర్స‌య్యిందే!
X
శ్రుతి హాస‌న్‌.. హీరోయిన్‌ గానే కాదు సింగ‌ర్‌గానూ స‌త్తా చాటుకున్న టాలెంటెడ్ గ‌ర్ల్‌. తెలుగు - త‌మిళం - హిందీ.. ఇలా మూడూ చోట్లా స‌క్సెస్‌ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. గ‌త సంవ‌త్స‌రం అయితే.. ఈ మూడు భాష‌ల్లో అగ్ర క‌థానాయ‌కుల‌తో ఆడిపాడ‌డ‌మే కాకుండా స‌క్సెస్‌ల‌ను అందిపుచ్చుకుంది. . బాలీవుడ్‌ లో అక్ష‌య్ కుమార్ కాంబినేష‌న్‌ లో 'గ‌బ్బ‌ర్ ఈజ్ బ్యాక్' చేసి విజ‌యాన్ని అందుకున్న‌ శ్రుతి.. టాలీవుడ్‌ లో ప్రిన్స్ మ‌హేష్‌ తో 'శ్రీ‌మంతుడు' రూపంలో ఘ‌న‌విజ‌యం అందుకుంది.

కోలీవుడ్‌ లో అజిత్ తో 'వేదాళ‌మ్ చేస్తే అది కూడా బంప‌ర్ హిట్ అయింది. ఎటొచ్చి విజ‌య్‌ తో చేసిన‌ 'పులి' మాత్ర‌మే నిరాశ‌ప‌రిచింది. ఏదేమైనా గ‌తేడాది మూడు భాష‌ల్లోనూ స్టార్ హీరోల‌తో రాణించిన శ్రుతికి.. ఈ సంవ‌త్స‌రం ఎలా ఉండాలి? అదే స్థాయిలో స్టార్ ల‌తో సంద‌డి చేసే అవ‌కాశ‌ముండాలి క‌దా! కానీ ఇక్క‌డే సీన్ రివ‌ర్స‌య్యింది. మూడు భాష‌ల్లోనూ దాదాపు మీడియం రేంజ్ సినిమాలే ఉన్నాయి శ్రుతి చేతిలో.

సూర్య‌తో క‌లిసి న‌టిస్తున్న ఒక్క‌ ఎస్ 3 త‌ప్ప‌. తెలుగులో 'ప్రేమ‌మ్‌' కోసం నాగ‌చైత‌న్య‌తో.. హిందీలో ఇప్ప‌టికే విడుద‌లైన‌ 'రాకీ హ్యాండ్స‌మ్' కోసం జాన్ అబ్ర‌హంతో.. త‌న తండ్రి క‌మ‌ల్ హాస‌న్‌ తో తొలిసారి క‌లిసి న‌టిస్తున్న 'శ‌భాష్ నాయుడు' (త‌మిళ్‌ - తెలుగు - హిందీ)లో మ‌ను నారాయ‌ణ్‌ తో శ్రుతి జోడీ క‌ట్టింది. వీళ్లంద‌రూ అగ్ర‌తార‌లు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి గ‌తేడాది అంతా స్టార్స్‌ తో మూడు చోట్ల మెప్పించిన శ్రుతికి.. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉండ‌డం ఆశ్చ‌ర్య ప‌రిచే విష‌యం.