Begin typing your search above and press return to search.

బాలయ్య, చిరు తర్వాత హాలీవుడ్‌ కి ముద్దుగుమ్మ జంప్‌

By:  Tupaki Desk   |   21 Oct 2022 1:30 PM GMT
బాలయ్య, చిరు తర్వాత హాలీవుడ్‌ కి ముద్దుగుమ్మ జంప్‌
X

యూనివర్శిల్ స్టార్ కమల్‌ హాసన్ కూతురు శృతి హాసన్ కి బాలీవుడ్ లో మంచి ఎంట్రీ దక్కింది కానీ సక్సెస్ లేక ఢీలా పడ్డ సమయంలో గబ్బర్‌సింగ్ సినిమా తో సూపర్ హిట్ దక్కింది. అప్పటి నుండి వెనక్కు తిరిగి చూసుకోకుండా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తాను వద్దు అనుకుంటే తప్ప గ్యాప్‌ రాకుండా వరుసగా సినిమాలను ఈమె చేస్తూనే ఉంది.

ప్రస్తుతం తెలుగు లో ఇద్దరు స్టార్‌ హీరోలు అయిన బాలయ్య మరియు చిరంజీవికి జోడీగా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా ప్రభాస్‌ తో సలార్‌ సినిమాలో కూడా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు లో ఇంత బిజీగా ఉన్న శృతి హాసన్ కు మరిన్ని సినిమా ల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

ఈ సమయంలోనే ఈమెకు ఏకంగా హాలీవుడ్‌ నుండి పిలుపు వచ్చింది. గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌ గురించి ఎట్టకేలకు ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. బాలయ్య మరియు చిరంజీవిలతో సినిమాలు పూర్తి అయిన తర్వాత హాలీవుడ్‌ లో 'ది ఐ' అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో నటించబోతుంది. అందమైన ఈ అమ్మడికి దక్కిన ఈ ఆఫర్‌ గురించి అధికారికంగా ప్రకటించింది.

ఒక ద్వీపం లో జరిగే సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా లో శృతి హాసన్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.. ఇది ఆమెకు హాలీవుడ్‌ లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టి గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా మాదిరిగా మంచి పేరును తెచ్చి పెడుతుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.