Begin typing your search above and press return to search.

వకీల్‌ సాబ్‌ లో లేనన్న భాగ్యలక్ష్మి

By:  Tupaki Desk   |   12 April 2020 5:30 PM IST
వకీల్‌ సాబ్‌ లో లేనన్న భాగ్యలక్ష్మి
X
పవన్‌ కళ్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రంలో భాగ్యలక్ష్మి పాత్రలో నటించి మెప్పించి మొదటి సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ శృతి హాసన్‌. చాలా కాలం తర్వాత పవన్‌ కళ్యాణ్‌ కు గబ్బర్‌ సింగ్‌ తో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ దక్కింది. ఆ సినిమా ఇద్దరికి కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఆ సినిమా తర్వాత మళ్లీ కాటమరాయుడు సినిమా కోసం పవన్‌ ఇంకా శృతి హాసన్‌ కలిసి నటించారు. మళ్లీ వీరిద్దరు కలిసి వకీల్‌ సాబ్‌ చిత్రంలో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘పింక్‌’ ను తెలుగులో వకీల్‌ సాబ్‌ టైటిల్‌ తో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. పవన్‌ కళ్యాణ్‌ ఇంటి నుండే డబ్బింగ్‌ కూడా పూర్తి చేశాడని అన్నారు. ఇదే సమయంలో శృతి హాసన్‌ ఈ చిత్రంలో నటించిందని.. నటించబోతుందని వచ్చిన వార్తలను ఆమె కొట్టి పారేసింది. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ప్రకటించింది.

ప్రస్తుతం తాను తెలుగులో ‘క్రాక్‌’ చిత్రంలో మాత్రమే నటిస్తున్నాను అంది. వకీల్‌ సాబ్‌ చిత్రం కోసం నన్ను ఎవరు సంప్రదించలేదు. పవన్‌ కళ్యాణ్‌ గారితో నటించడం నాకు ఎప్పుడు ఇష్టమే. భవిష్యత్తులో ఆయనతో మళ్లీ నటించేందుకు ఎదురు చూస్తున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి అయితే వకీల్‌ సాబ్‌ చిత్రంలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చేసింది.