Begin typing your search above and press return to search.

ఐశ్వర్య, దీపికల సరసన శృతిహాసన్..

By:  Tupaki Desk   |   21 Sep 2015 5:54 AM GMT
ఐశ్వర్య, దీపికల సరసన శృతిహాసన్..
X
శృతిహాసన్ బాలీవుడ్ అగ్ర హీరోయిన్ల సరసన చేరిపోయింది. దీపికా పదుకునే లాంటి టాప్ స్టార్స్ పక్కన శృతి పేరు రాసుకునే రోజు వచ్చేసింది. అయితే ఇది హీరోయిన్ గా కాదులెండి. ప్రస్తుతం కోక్ కి నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది శృతిహాసన్. ఈ కూల్ డ్రింక్ కి గతంలో ఐశ్వర్యరాయ్ - దీపికా పదుకునే - కరీనా కపూర్ లాంటి అగ్రతారలు మాత్రమే ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు కోకకోలా కంపెనీ రేసుగుర్రంలా దూసుకుపోతున్న శృతిని.. ప్రచార కర్తగా ఎంచుకుంది.

దీంతో బిగ్ స్టార్స్ లీగ్ లో ముందే ఎంటర్ అయ్యేందుకు ఈ భామకి ఛాన్స్ వచ్చింది. నిజానికి కెరీర్ ప్రారంభించినపుడు ఈమెకి ఐరన్ లెగ్ అనే స్టాంప్ ఉంది. కనిపిస్తే చాలు సినిమా ఖల్లాస్ అనేంతగా బ్యాడ్ నేమ్ వచ్చింది. కానీ గబ్బర్ సింగ్ తో ఫామ్ లోకి వచ్చిన శృతి.. తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిందీలో కూడా వెల్ కం బ్యాక్ లాంటి వంద కోట్ల చిత్రం ఈమె ఖాతాలో ఉంది. మంచి ఒడ్డు - పొడవు - పర్సనాలిటీ ఉన్న శృతిహాసన్ సూపర్బ్ డ్యాన్సర్ కూడా. దీంతో ఈమె కెరీర్ లో ఇంకా అనేక శిఖరాలు ఎక్కే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.

కమల్ హాసన్ కూతురుగా పరిచయం అయినా.. తండ్రి పేరు చెప్పుకోకుండా ప్రతభ తోనే కెరీర్ ని సానబెట్టుకుంటున్న శృతిహాసన్.. ఇప్పుడు చాలామందికి ఇన్ స్పిరేషన్ గా కూడా నిలుస్తోంది. అక్టోబర్ 1న తమిళనాట రిలీజ్ కానున్న విజయ్ మూవీ పులిలో కూడా శృతి లీడ్ కేరక్టర్ చేస్తోంది. ఈ మూవీ కూడా భారీ హిట్ కొట్టే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి.