Begin typing your search above and press return to search.

పాత్ర కోసం ఇక మారలేను

By:  Tupaki Desk   |   6 Sept 2017 11:00 PM IST
పాత్ర కోసం ఇక మారలేను
X
రయోగాత్మకమైన కథలను తెరకెక్కించే చాలామంది నటినటులు కథకు అవసరమయ్యే విధంగా వారి శరీర ఆకృతిని మార్చుకుంటారు. హీరోల విషయం పక్కన పెడితే హీరోయిన్లు కూడా అప్పుడప్పుడు వారి శరీరాకృతిని మార్చుకోవడానికి తెగ ఇబ్బంది పడతారట. అందంగా కనిపిస్తునే పాత్రకు అవసరమయ్యే విధంగా ఉండాలి.

అయితే ఆ తరహాలో బాడీని మెయింటెన్ చేయడం చాలా కష్టం అంటోంది శ్రుతిహాసన్. తండ్రికి తగ్గ తనయురాలిగా సౌత్ లో తనకంటూ ఓ స్థాయిని ఏర్పరచుకున్న ఈ భామ దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రిన్ షేర్ చేసుకుంది. అయితే ఈ అమ్మడు సినిమాల్లోకి రాకముందు చాలా బొద్దుగా ఇష్టం వచ్చినట్టు ఉండేదట. కానీ సినిమా ప్రపంచం లోకి అడుగుపెట్టిన తర్వాత ఇష్టాలన్నీ పక్కన పెట్టాల్సిందే. కొంతమంది హీరోయిన్లు పాత్ర కోసం కష్టపడి ఇష్టంగా మారుతుంటే మరికొందరు ఎంతో ఒత్తిడికి లోనవుతారు.. మరి ఆ తరహా పరిస్థితి గురించి శృతి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.

ఆమె ఏమందంటే.. "వచ్చిన కొత్తలో సిల్వర్ స్క్రిన్ పై బ్యూటీఫుల్ గా కనిపించాలి కాబట్టి నేను కూడా అందుకోసం తెగ కష్టపడేదాన్ని. ఏ మాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా పాత్ర కోసం సింపుల్ గా అనుగుణంగా రెడీ అయ్యేదాన్ని . ఇక చివరికి నాలా ఉండడం మర్చిపోయి కథకు తగ్గట్టుగా నా శరీరాకృతిని మార్చుకున్నా.. ఇక ఇప్పుడు ఆ ధోరణిని పక్కన పెట్టేసి ఇప్పుడు నాలా ఉండగలుగుతున్నా... ఫైనల్ గా ఇది నేను కాదు.. నేను నాలా ఉండాలి’ అనుకుంటున్నాను అని చెబుతూ.. లావుగా ఉన్నంత మాత్రాన అందంగా లేరని కాదు. ఎలా ఉన్నా వచ్చిన పాత్రకు నటనపరంగా న్యాయం చేయగలిగితే ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది శ్రుతి.