Begin typing your search above and press return to search.

ఇన్ స్టా సెషన్ లో దుర‌భిమానిపై శ్రుతి ఫైర్‌

By:  Tupaki Desk   |   10 Feb 2022 3:50 AM GMT
ఇన్ స్టా సెషన్ లో దుర‌భిమానిపై శ్రుతి ఫైర్‌
X
సోష‌ల్ మీడియాల్లో సెల‌బ్రిటీల‌పై నిరంత‌ర దాడుల గురించి తెలిసిందే. ఇష్టానుసారం నోటికి వ‌చ్చిన‌ది అనేయ‌డం ఆపై చీవాట్లు తిన‌డం నెటిజ‌నుల‌కు ప‌రిపాటిగా మారింది. వెకిలిత‌నం వ్యంగ్యం త‌మ‌కు మాత్ర‌మే తెలుసున‌నుకుని భంగ‌ప‌డుతున్న వాళ్లెంద‌రో. ఇక ద‌క్షిణాది స్టార్ల‌పై ఉత్త‌రాది దుర‌భిమానుల వ్యంగ్యం వెట‌కారం నిత్యం చూసేదే. కానీ ఈసారి శ్రుతి హాస‌న్ రూపంలో ఉత్త‌రాది యువ‌కుడికి చీవాట్లు త‌ప్ప‌లేదు.

శృతి హాసన్ నిరంత‌రం సోషల్ మీడియాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిన‌దే. తాజాగా ఇన్ స్టాలో తన అభిమానులతో ఇంటరాక్టివ్ వీడియో సెషన్ లో పాల్గొన‌గా ఒక ఉత్త‌రాది దుర‌భిమాని త‌న‌ని ఇర్రిటేట్ చేశాడు. శ్రుతి దక్షిణాదికి చెందిన నటి కాబట్టి హిందీ మాట్లాడగలదా? అని ఒక వినియోగదారు అడగడంతో శ్రుతి ఫైరైంది. శ్రుతి నుంచి త‌క్ష‌ణ జవాబు ఏమిటంటే..? ``మీరు బహుశా నా విష‌యంలో చేయకూడని చేస్తున్నారు`` అని నిల‌దీసింది. ఒకడు నన్ను ``ఆప్ హిందీ బోల్ పయేగీ క్యా యు ఆర్ ఫ్రమ్ ది సౌత్ నా?`` అని అడిగాడు. అది వేరే గ్రహం అనేది అత‌డి ఉద్ధేశమా? ``మేమంతా సినిమాలు చేస్తున్నాం. కష్టపడి పని చేస్తున్నాం. 2022లో పక్షపాతానికి తావు లేదు`` అని అంది. ఎప్ప‌టిలానే సూటిగా నిజాయితీగా తాను అనాల‌నుకున్న‌వి అనేసింది శ్రుతి. సూటిగానే అత‌గాడికి జ‌వాబిచ్చేసింది.

ఇక శ్రుతిహాస‌న్ హిందీ చిత్రసీమ‌కు కొత్తేమీ కాదు. అక్క‌డ ఆల్మోస్ట్ స్టార్ హీరోయిన్ స్టాట‌స్ అందుకుంది. ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ లోనూ న‌టించింది. లక్ చిత్రంతో తెరంగేట్రం చేసిన శ్రుతిహాస‌న్ ఆ త‌ర్వాత‌ తేవర్ - దిల్ తో బచా హై జీ - డి డే- వెల్ కమ్ బ్యాక్- రాకీ హ్యాండ్సమ్- బెహెన్ హోగీ తేరీ స‌హా పలు హిందీ చిత్రాలలో నటించింది. కానీ సౌత్ నాయికానే అక్క‌డ అంతా పిలిచారు కానీ త‌మ‌లో విలీనం చేసుకుని మాట్లాడేందుకు హిందీ ప‌రిశ్ర‌మ కూడా ఏనాడూ ఇష్ట‌ప‌డలేదు.

టాలీవుడ్ లో గ‌బ్బ‌ర్ సింగ్ తో బంప‌ర్ హిట్ కొట్టిన శ్రుతిహాస‌న్ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోల స‌ర‌స‌న నాయిక‌గా న‌టించింది. ప్ర‌స్తుతం ప్రభాస్ స‌ర‌స‌న స‌లార్ లో కనిపించనుంది. ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రానికి కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. `బెస్ట్ సెల్లర్` అనే వెబ్ సిరీస్ లో కూడా శ్రుతి నటించనుంది. తాజాగా ట్రైల‌ర్ రిలీజై ఆక‌ట్టుకుంది. సిరీస్ లో శ్రుతి కాస్త అమాయ‌కురాలైన యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

న‌వ‌లా నాయిక‌గా శ్రుతి..!

పిట్ట‌క‌థ‌లు త‌ర్వాత‌ శృతి హాసన్ వ‌రుస‌గా వెబ్ సిరీస్ ల‌కు సంత‌కాలు చేస్తోంది. ఇప్పుడు `బెస్ట్ సెల్లర్` వెబ్ సిరీస్ తో హిందీ రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా ట్రైలర్ విడుద‌లైంది. ఇది అద్భుత‌మైన‌ కథనంతో కూడిన థ్రిల్లర్. ట్రైల‌ర్ ని ప‌రిశీలిస్తే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎన్నో. ఇందులో పాత్ర‌లు ఆస‌క్తిక‌రం. రియ‌ల్ లైఫ్ ఘ‌ట‌న‌ల‌తో న‌వ‌ల‌లు రాయ‌డం వాటిని థ్రిల్లింగ్ సిరీస్ లుగా మ‌ల‌చ‌డం ఆస‌క్తిని క‌లిగించ‌కుండా ఉంటుందా..! ట్రైల‌ర్ ఎంతో ఆస‌క్తిక‌రంగా సాగింది.

నటుడు అర్జన్ బజ్వా (సంపంగి హీరో) ప్రసిద్ధ నవలా రచయిత అయినప్పటికీ చేతన్ భగత్ లాగా మారాలని కోరుకుంటాడు. అర్జాబ్ తాహిర్ వజీర్ అతను విపరీతమైన అభిమాని అయిన మీటూ మాధుర్ (శ్రుతి)ని కలుస్తాడు. తాహిర్ తన తదుపరి నవల కోసం ఒక ఆలోచన కోసం వెతుకుతున్నప్పుడు.. అతను మీటూ చేతులపై ఉన్న మచ్చలను గమనించి ఒక నవలని అభివృద్ధి చేస్తాడు. అనుకోకుండా తాహిర్ గుర్తు తెలియని వ్యక్తిచే ట్రోలింగుకి గుర‌వుతాడు. దుర్మార్గుడు తాహిర్ ను వెంటాడి మీటూపై దాడి చేస్తాడు.

ఈ ఎపిసోడ్ ని పరిశోధించడానికి నటుడు మిథున్ చక్రవర్తి ఏసీపీ గా సీన్ లోకి ప్రవేశిస్తారు. శ్రుతి పాత్ర ఇందులో ఎంతో అమాయకంగా ఉంటుంది. కానీ రహస్యమైన పంచ్ ఉంది. ఇది రిజర్వ్ చేయబడిన పాత్ర. ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఎనిమిది ఎపిసోడ్ ల‌ వెబ్-సిరీస్ ముకుల్ అభ్యంకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 18 నుండి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది.