Begin typing your search above and press return to search.
డార్లింగ్ ప్రభాస్ పై శృతి క్రేజీ కామెంట్స్..!
By: Tupaki Desk | 28 May 2021 12:00 PM ISTదక్షిణాది స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది. అలాగే వచ్చిన అవకాశాలను కూడా వదులుకోకుండా ఓకే చెబుతూ అలా షెడ్యూల్స్ బిజీ చేసుకుంటుంది. లవ్ - బ్రేకప్ లాంటి సిట్యుయేషన్స్ తర్వాత అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్రాక్ సినిమాతో తెలుగులో ఖాతా పునఃప్రారంభించింది. రాగానే సూపర్ హిట్ అందుకుంది. క్రాక్ సినిమా శృతికి మర్చిపోలేని హిట్ ఇచ్చింది. అలా ఆ సినిమా హిట్ అయిందో లేదో వెంటనే అమ్మడికి ఆఫర్స్ అలా వచ్చిపడ్డాయి. అందులో ఓ పాన్ ఇండియా సినిమా కూడా లభించడం శృతి అదృష్టం అనే చెప్పాలి.
దీనితో పాటు ఓ తమిళ సినిమా కూడా చేస్తోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని టాక్. అయితే అసలు విషయం ఏంటంటే.. శృతి చేతిలో ప్రస్తుతం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో లాభం సినిమా ఉంది. అలాగే డార్లింగ్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు పెద్దవే కానీ సలార్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాతో శృతి డ్రీమ్ తీరనుంది. ఎందుకంటే.. ఈ వయ్యారికి డార్లింగ్ తో సినిమా చేయాలనే డ్రీమ్ ఉందట. ఆ విషయం ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
కానీ ఆమె చెప్పిందో లేదో వెంటనే సలార్ మూవీ ఓకే కావడం అదృష్టంగా భావిస్తుంది. ప్రస్తుతం శృతి ఫుల్ ఖుషి అనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే శృతి సలార్ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అలాగే ఈ సినిమాలో శృతి రోల్ గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. సలార్ సినిమాలో శృతి ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని ఇప్పటికే కథనాలు వెలువడ్డాయి. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ మేకర్స్ నుండి అదే నిజం అన్నట్లుగా సిగ్నల్ వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం కరోనా కారణంగా సలార్ షూటింగ్ ఆగిపోయింది. తాజాగా అమ్మడు మీడియాతో సంభాషణలో మాట్లాడుతూ.. "ఇప్పటివరకు నేను సలార్ చిన్న షెడ్యూల్ మాత్రమే చేసాను. కానీ డార్లింగ్ ప్రభాస్ చాలా హంబుల్ పర్సన్ అలాగే ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారు. మా డైరెక్టర్ కూడా అంతే. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి మాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.