Begin typing your search above and press return to search.

వీర‌సింహారెడ్డితో శ్రుతిహాసన్ రొమాంటిక్ సాంగ్!

By:  Tupaki Desk   |   11 Dec 2022 11:30 AM GMT
వీర‌సింహారెడ్డితో శ్రుతిహాసన్ రొమాంటిక్ సాంగ్!
X
నటసింహ బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా 107వ సినిమా 'వీర‌సింహారెడ్డి' గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సినిమా ప‌నుల‌న్ని శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. రిలీజ్ కి ఇంకా స‌రిగ్గా నెల రోజులే స‌మ‌యం ఉండ‌టంతో? ప‌నుల్ని మ‌రింత వేగ‌వంతం చేసారు. ఇప్ప‌టికే టాకీ పూర్తి చేసుకుంది.

బ్యాలెన్స్ ఒక్క పాట షూటింగ్ జ‌రుగుతుంది. ఆ పాట పూర్త‌యితే షూటింగ్ మొత్తం పూర్త‌యిన‌ట్లే. మ‌రోవైపు నిర్మాణ‌నంత‌ర ప‌నులు వేగంగానే జ‌రుగుతున్నాయి. ఇంకో వైపు ప్ర‌చారానికి సంబంధించిన ప‌నుల్ని వేగ‌వంతం చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు అంత‌కంత‌కు అంచ‌నాలు పెంచేస్తున్నాయి. వీర సింహారెడ్డి మ‌రోసారి బాక్సాపీస్ వ‌ద్ద విశ్వ‌రూపం చూపించేలాగే క‌నిపిస్తున్నారు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య చార్ట్ బస్టర్ గా నిలిచింది. రెండో సింగిల్ లిరికల్ వీడియో డిసెంబర్ 15న విడుదల కానుంది. సుగుణ సుందరి అనే యుగళగీతం ద్వారా మెప్పించ‌డానికి రెడీ అవుతున్నారు.

సుందరమైన లొకేషన్‌లో చిత్రీకరించిన పాటలో తెలుస్తోంది. బాల‌య్య‌..శ్రుతి హాస‌న్ జంట తెర‌పై ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌ని మ‌చ్చుకు వ‌దిలిన రొమాంటిక్ కెమిస్ట్రీని పోస్టర్ చూస్తేనే అంచ‌నా వేయోచ్చు.

ఇంకా సినిమా నుంచి మరిన్ని ప్ర‌చార చిత్రాలు రావాల్సి ఉంది. వాటితో సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యే అవ‌కాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు బాల‌య్య 108వ సినిమాని అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. 107వ సినిమా రిలీజ్ కాకుండానే 108ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు.

అలాగే 109..110వ సినిమాల‌కు సంబంధించి అప్పుడే చ‌ర్చ‌లు కూడా సాగుతున్నాయి. బాల‌య్య స్వ‌యంగా 'ఆదిత్య 999 'క‌థ‌ని సొంతంగా త‌యారు చేసుకుని పెట్టుకున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే దాన్ని ఆయ‌నే న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలు ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు సీరియ‌స్ గా త‌న‌య‌క‌డు మోక్ష‌జ్ఞ ఎంట్రీకి సంబంధించిన ప‌నుల్లోనూ త‌ల‌మున‌క‌లైన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. వ‌చ్చే ఏడాది త‌న‌యుడ్ని లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్న‌ట్లు తెలిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.