Begin typing your search above and press return to search.

ఆ విషయం ఇప్పట్లో చెప్పను..అంటున్న స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   11 Jun 2020 10:10 AM GMT
ఆ విషయం ఇప్పట్లో చెప్పను..అంటున్న స్టార్ హీరోయిన్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ గా మళ్లీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. రోజురోజుకి భారీ అంచనాలు పెరుగుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన పింక్ సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాలో హీరోయిన్ నివేత థామస్ ప్రముఖ పాత్ర పోషిస్తుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్నీ పనులు పూర్తి అవుతుండగా.. పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగిలింది. అయితే తాజాగా ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ శృతి హాసన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

గబ్బర్ సింగ్ - కాటంరాయుడు సినిమాల తర్వాత శృతి పవన్ తో ఇదే హ్యాట్రిక్ మూవీ అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య శృతిహాసన్ కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటుంది. ఇక ఇటీవలే ఓ లైవ్ లో తన అభిమానులతో ముచ్చటించింది శృతి. లైవ్ లో ఓ నెటిజన్ మీరు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.. నిజమేనా? అని అడిగాడు. ఆ ప్రశ్నకు శృతిహాసన్ స్పందించి.. 'తను ఇప్పుడప్పుడే ఈ సినిమా గురించి క్లారిటీ ఇవ్వలేను' అని' చెప్పుకొచ్చింది. అంతే ఇక నెటిజన్లు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు ఈ సినిమాలో శృతిహాసన్ ఉందా లేదా చెప్పాలంటూ.. వకీల్ సాబ్ చిత్రయూనిట్ సభ్యులకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికైనా వకీల్ సాబ్ టీమ్ స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని అడుగుతున్నారు. చూడాలి మరి చిత్రయూనిట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుందేమో!