Begin typing your search above and press return to search.

మా నాన్నలాంటి మగాడే లేడెక్కడా

By:  Tupaki Desk   |   29 July 2015 3:39 PM IST
మా నాన్నలాంటి మగాడే లేడెక్కడా
X
ఆన్‌ సెట్స్‌ ఎనర్జీ లెవల్స్‌ ని ఎప్పుడూ ఒకేలా మెయింటెయిన్‌ చేయాలంటే అందరి వల్ల కాదు. అది కేవలం కొందరికే సాధ్యం. అది కూడా మా నాన్నలాగా మెయింటెయిన్‌ చేయాలంటే అసాధ్యం.. అని ఘంటాపథంగా చెబుతోంది శ్రుతిహాసన్‌.

ఈ వయసులోనూ నాన్నగారు ఆన్‌ సెట్స్‌ ఎంతో క్రమశిక్షణతో, వృత్తిగత నిబద్ధతతో పనిచేస్తారు. అది అన్ని సందర్భాల్లో నాకు ఇన్‌ స్పిరేషన్‌. నాన్నలాగా, జాన్‌ అబ్రహాం లాగా ఫిట్‌ గా ఉండడం కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తుంటా. వారిలాగా బలంగా అవ్వడానికి నేను బాగా తింటుంటా అంటూ జోకేసి కిసుక్కున నవ్వేసుకుంది. నిజమే అంత క్రమశిక్షణ ఉన్న నటుడు కాబట్టే నేడు శ్రుతికి కూడా ఆ లక్షణాలే అబ్బాయి. అందుకే ఎంత మంది స్టార్లు ఉన్నా తనదైన పంథాలో టాప్‌ పొజిషన్‌ కి ఎదిగేసింది.

శ్రుతిహాసన్‌ ఇప్పటికిప్పుడు అరడజను ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఓ వైపు తళా అజిత్‌ సరసన సినిమా, మరోవైపు అజయ్‌ దేవగన్‌ సరసన ఓ సినిమా, జాన్‌ అబ్రహాంతో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 29 వయసులో ఓ అమ్మాయి ఇంతకంటే గొప్ప విజయాలు ఇంకేం సాధించాలి? శ్రుతి ఛాలెంజ్‌ లో నెగ్గినట్టే.

శ్రుతి నటిస్తున్న వెల్‌కం బ్యాక్‌, బాద్‌షా హో చిత్రాలు ప్రస్తుతం ఆన్‌ సెట్స్‌ ఉన్నాయి. ఇవి రెండూ త్వరలోనే చిత్రీకరణలు పూర్తి చేసుకుని ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కి రానున్నాయి. మిగిలిన ప్రాజెక్ట్స్‌ సెట్స్‌ కెళ్లడానికి రెడీ లో ఉన్నాయి.