Begin typing your search above and press return to search.
ఆ తప్పు చేస్తే ఇట్టే పసిగట్టేస్తానంటోంది!
By: Tupaki Desk | 17 March 2015 10:58 AM ISTవిశ్వనటుడు కమల్‌హాసన్ నటవారసురాలిగా సినీపరిశ్రమలో అడుగుపెట్టింది శ్రుతిహాసన్. అయితే అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకుంది. కృషితో నాస్తి దుర్భిక్షం.. అన్న చందంగా కెరీర్‌ని గొప్పగా మలుచుకుంది. అయితే ఇదంతా ఎలా సాధ్యమైంది? అన్న ప్రశ్న ఉత్పన్నమైతే.. శ్రుతి స్పందన చాలా వేరుగా ఉంది. నన్ను నేను విమర్శించుకుంటా. నాలోని లోపాల్ని నా అంతట నేనుగా పసిగట్టేస్తా. నేను చేసిన తప్పేంటో ఇతరుల కంటే ముందే పసిగట్టేస్తా. నటన వరకూ ప్రతి విషయంలో స్పష్టతతో ఉంటా ..అంటూ చెప్పుకొచ్చింది.
అవును అందుకే తొలి అడుగులు వేసేప్పుడు తడబడినా మళ్లీ తమాయించుకుంది. ఇక్కడ కెరీర్ అంటే ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఉండాలి అని తెలుసుకుని ప్రేక్షకుడి మస్తిష్కాన్ని చిద్రం చేసే రీతిలో నేడు ఎక్స్‌పోజింగ్ చేసేస్తోంది. ఏం చేస్తే యువతరానికి నచ్చుతుందో పక్కాగా తెలుసుకుంది. అందుకే ఇటీవలి కాలంలో ఏ సినిమాలో కనిపించినా అంగాంగ ప్రదర్శనతో రెచ్చిపోతోంది. గ్లామర్ ప్రపంచంలో ఎదగాలంటే ఏదో ఒకటి చేయాలి. అదేదో ముందే తెలుసుకుని చేసి చూపించింది కాబట్టే శ్రుతి అంతే వేగంగా స్టార్‌డమ్ సంపాదించుకుందన్నమాట! మహేష్‌తో కొరటాల సినిమా, నాగార్జున-కార్తీ మల్టీస్టారర్‌లో నటిస్తోందిప్పుడు.