Begin typing your search above and press return to search.

అమ్మడి తదుపరి తెలుగు సినిమా ఏంటో?

By:  Tupaki Desk   |   9 Sep 2015 3:39 PM GMT
అమ్మడి తదుపరి తెలుగు సినిమా ఏంటో?
X
శ్రుతిహాసన్‌ లెగ్గు పెడితే చాలు సినిమా హిట్టే అన్న టాక్‌ నడుస్తోంది. ఐరెన్‌ లెగ్‌ టు గోల్డెన్‌ లెగ్‌ ప్రమోట్‌ అయిన కథానాయికగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం దర్శనిర్మాతల లక్కీ మస్కట్‌ గా పాపులర్‌ అయింది. తెలుగు, తమిళ్‌, హిందీ పరిశ్రమల్లో ఈ అమ్మడు ఇంతకాలం క్షణం తీరిక లేకుండా గడిపేసింది. ఇటీవలే రిలీజైన శ్రీమంతుడు టాలీవుడ్‌ లోనే నంబర్‌ -1 హిట్‌ గా నిలిచింది.

ఆ సినిమా తర్వాత శ్రుతి నటించే వేరొక సినిమా లేనేలేదు. టాలీవుడ్‌ పై దృష్టి సారించేంతటి టైమే లేదు అమ్మడికి. అటు కోలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రాజెక్టులతోనే సరిపోతోంది. ఇటీవలే శ్రుతి నటించిన బాలీవుడ్‌ సినిమా పెద్ద హిట్‌ కొట్టింది. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇవేగాక తమిళంలో సింగం 3లో నటించేందుకు వెళుతోంది.

ఇప్పటికైతే తెలుగులో ఏ సినిమా లేనట్టే. శ్రుతికి మిగతా భాషల కంటే తెలుగులోనే వీరాభిమానులున్నారు. వీళ్లంతా శ్రుతిని అనువాద చిత్రాల్లోనే చూసుకోవాల్సొస్తుందేమో అంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ డైరీ ఖాళీ లేదు. 2016 ఫిబ్రవరి తర్వాతే తెలుగు సినిమాకి కమిటయ్యే ఛాన్సుంది. అంతవరకూ శ్రుతి కోసం దర్శకనిర్మాతలు క్యూలో ఉండాల్సిందే.