Begin typing your search above and press return to search.
శ్రుతిలోని ఆ డార్క్ యాంగిల్ షాకిస్తోందిగా..
By: Tupaki Desk | 16 Oct 2020 3:00 PM ISTచీకటి నుంచి వెలుగును పంచాలి. చిమ్మ చీకటిలో ప్రకాశవంతమైన కాంతుల్ని దోసిలి పట్టాలి. అప్పుడు వెలుగు లేకపోయినా చీకటి విలువెంతో తెలుస్తుంది. లేదంటే జీవితమంతా చీకటే అని కలవరపడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి సందిగ్ధత ఏదో శ్రుతిహాసన్ ని వెంటాడి వేధిస్తోంది. ప్రేమలో వైఫల్యం ప్రభావమా? ఇది అంటూ కొందరు నెటిజనులు కామెంట్లు చేస్తున్నా.. తనకంటూ ఓ స్టైల్ ఉందని వాదించే అభిమానులు ఉన్నారు. ఫ్యాషనిస్టాగా శ్రుతి ఆల్వేస్ క్రియేటివ్.. డిఫరెంట్ అని పొగిడేస్తున్నారు కొందరైతే.
శ్రుతి హాసన్ తిరిగి సినిమాల్లోకి వచ్చింది మొదలు తనని తాను ప్రతిసారీ ఏదో ఒక ప్రత్యేకతతో ఎలివేట్ చేసుకునేందుకు పోటీపడుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. శ్రుతి హాసన్ స్టన్నింగ్ అనిపించే ఫోటోల్ని షేర్ చేస్తోంది. అయితే వీటిలో ఎక్కువగా డార్క్ షేడ్ లో ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఇది తన మనుసును ఆవిష్కరిస్తోందా? తన ఆలోచనల్లో ఏం ఉందో వెల్లడిస్తోందా?
డార్క్ ఫాంటసీ ఫోటో షూట్ లో శ్రుతి అంతర్లీనంగా తికమక పెట్టే సమస్యతో నాటకీయతను ఆవిష్కరించడం వెనక రీజన్ ఏమై ఉంటుంది? అంటూ ఆరాలు తీస్తున్నారు కుర్రాళ్లు. ఎంతో డర్లీగా కనిపిస్తున్న హెయిర్ .. నల్లని వస్త్రధారణలో ఆమె హాట్ లుక్స్ ను ప్రదర్శిస్తుంది. వేరే పోస్టింగులో తనను తాను సహజ ప్రేమికురాలిగా ను ఎలివేట్ చేస్కుంది.
కెరీర్ సంగతి చూస్తే.. శ్రుతి హాసన్ ఇటీవలే `పుతం పుదు కలై` అనే తమిళ సిరీస్ లో నటించారు. రవితేజ క్రాక్ లో నటిస్తున్నారు. సుదీర్ఘ విరామం తరువాత శ్రుతి తిరిగి వరుసగా సినిమాలకు సంతకం చేస్తోంది. కంబ్యాక్ లో తిరిగి తన స్థానాన్ని పదిలపర్చుకునే ప్రయత్నం చేస్తోంది.