Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : అందరూ 'సలార్‌' బ్యూటీని ఫాలో అవ్వాలి

By:  Tupaki Desk   |   23 Jun 2021 11:00 AM IST
పిక్‌ టాక్‌ : అందరూ సలార్‌ బ్యూటీని ఫాలో అవ్వాలి
X
కరోనా ఏ ఒక్కరిని వదిలి పెట్టడం లేదు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి విషయంలో అత్యంత ప్రమాదకారిగా మారింది. ఇలాంటి సమయంలో అడుగు బయట పెట్టాలంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోన సోకుతుంది. అందుకే అడుగు బటయ పెట్టేప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు మాస్క్ ను లైట్ తీసుకుంటే కొందరు శానిటైజర్‌ ను పట్టించుకోరు.. ఇంకొందరు వ్యాక్సినేషన్‌ కు దూరంగా ఉంటున్నారు. దాంతో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో తనను చూసి అంతా నేర్చుకోవాలి అన్నట్లుగా శృతి హాసన్ సోషల్‌ మెసేజ్ ను ఇచ్చింది.

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా అవసరం లేకుండా బయటకు వెళ్ల కూడదనే ఉద్దేశ్యంతో దాదాపు మూడు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యిందట. ఈ సలార్‌ బ్యూటీ ఎట్టకేలకు ఇంట్లో నుండి బయటకు వచ్చింది. స్నేహితుడు సంతను హజారికా తో కలిసి శృతి ఔటింగ్ వెళ్లింది. ఆ సమయంలో ఆమె తీసుకున్న జాగ్రత్తలు అభినందనీయం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

డబుల్‌ మాస్క్‌.. చేతిలో శానిటైజర్‌.. పైగా వ్యాక్సినేటెడ్‌ కనుక ఎట్టి పరిస్థితుల్లో కరోనాతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శృతి హాసన్ పేర్కొంది. వీరిలా అందరు కూడా డబుల్ మాస్క్‌ తో ఖచ్చితంగా శానిటైజర్‌ ను వాడుతూ వ్యాక్సిన్‌ ను సాధ్యం అయినంత త్వరగా వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యంగ్ కపుల్‌ అందరికి ఆదర్శం అవ్వాలి.. వీరిని ఫాలో అయ్యి కరోనాకు దూరంగా ఉండవచ్చు.