Begin typing your search above and press return to search.

హేయ్ శ్రుతి.. ఎవ‌రా కొత్త ఫ్రెండ్?

By:  Tupaki Desk   |   28 Dec 2019 10:54 AM GMT
హేయ్ శ్రుతి.. ఎవ‌రా కొత్త ఫ్రెండ్?
X
స్టార్ హీరోయిన్ శ్రుతిహాస‌న్ తో ఈ కొత్త స్నేహితుడు ఎవ‌రు? అంతగా హ‌గ్గిచ్చింది? చ‌లికాలం మ‌రీ అలా కౌగిలింత‌తో వేడెక్కించింది. ప్చ్‌.. ఎవ‌రో తెలియాలంటే కాస్త ఓపిగ్గా వివ‌రంలోకి వెళ్లాలి.

గ‌త కొంత‌కాలంగా శ్రుతిహాస‌న్ ఎందుక‌నో సైలెంటుగా త‌న పని తాను చేసుకుపోతోంది. మైఖేల్ కోర్స‌లే నుంచి విడిపోయిన త‌ర్వాత పూర్తిగా సినిమాలు.. విదేశీ కాన్సెర్టుల‌పైనే దృష్టి సారిస్తోంది. ఇక ఇటీవ‌లి కాలంలో కాన్సెర్టుల్ని కూడా త‌గ్గించి సినిమాలకే ప్రాధాన్య‌త‌నిస్తోంది ఎందుక‌నో. ప్ర‌స్తుతం ఓ రెండు చిత్రాల‌కు క‌మిటై ఆ ప‌నిలోనే బిజీగా ఉంది.

అలా షూటింగ్ బిజీలో ఉన్న‌ప్పుడే ఇదిగో ఇలా సెట్స్ లో త‌న‌కో కొత్త ఫ్రెండ్ ప‌రిచ‌య‌మ‌య్యాడు. త‌న‌ను ఎత్తుకుని ఇలా ఫోటోకి ఫోజిచ్చింది. హి ఈజ్ సో క్యూట్.. ల‌వ్ లీ. పొట్టిగా బుజ్జిగా ముద్దుగా ఉన్న ఆ కుక్క పిల్ల శ్రుతి ఇచ్చిన హ‌గ్గుకి ఎంతో ప్రేమ‌గా అలా ఒదిగిపోయింది మ‌రి. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న క్రాక్ చిత్రంలో శ్రుతి క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఓ త‌మిళ చిత్రంలోనూ శ్రుతి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.